ETV Bharat / international

Nigeria Boat Accident : పడవ మునిగి 17 మంది మృతి.. 70 మంది గల్లంతు.. మృతదేహాలు దొరికే ఛాన్స్ కూడా లేకుండా.. - ఆఫ్రికాలో పడవ ప్రమాదం

Nigeria Boat Accident : నైజీరియాలో పడవ మునిగి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది గల్లంతయ్యారు.

Nigeria Boat Accident
Nigeria Boat Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 9:57 PM IST

Updated : Oct 30, 2023, 10:47 PM IST

Nigeria Boat Accident : ఆఫ్రికా దేశం నైజీరియాలో పడవ మునిగిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తారాబా రాష్ట్రంలోని అర్డో-కోలా జిల్లాలో ఈ ఘటన జరిగింది. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 70 మంది గల్లంతయ్యారు. దేశంలోనే అతిపెద్ద నది అయిన బెన్యూలో ఈ పడవ ప్రయాణిస్తోంది. స్థానిక చేపల మార్కెట్ నుంచి వ్యాపారులతో తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే పడవ బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు.

'పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు'
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 14 మందిని మత్య్సకారులు, స్థానికుల సాయంతో రక్షించినట్లు నైజీరియా జాతీయ అత్యవసర సేవల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు తారాబా గవర్నర్ అగ్బు కెఫాస్. నదీజలాలు సంపదకు వనరుగా ఉండాలని, మరణాలకు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

'మృతదేహాలు దొరికే ఛాన్స్ లేదు'
పడవ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తారాబా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్యూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. ఫలితంగా సహాయక చర్యలు చేపట్టడానికి విఘాతం కలుగుతోందని వివరించారు. ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో ఘటనాస్థలిలో మృతదేహాలు దొరుకుతాయన్న ఆశ కూడా లేదని వ్యాఖ్యానించారు.

కాంగోలో 28 మంది మృతి
ఇటీవల కాంగోలోనూ ఇదే తరహా పడవ ప్రమాదం జరిగింది. ఈక్వెటూర్ ప్రావిన్స్​లోని కాంగో నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ పడవ బోల్తా పడింది. అక్టోబర్ 22న జరిగిన ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈక్వెటూర్​ రాజధాని బండకా నుంచి 74 మైళ్ల దూరంలో ఉన్న న్గోండోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ పడవ బోల్తా పడింది. పడవలో ప్రయాణిస్తున్నవారిలో దాదాపు 200 మందిని అధికారులు రక్షించారు. మరికొందరు తప్పిపోయారు. కాగా, అక్టోబర్ 14న కాంగోలోనే మరో పడవ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మందికి పైగా గల్లంతయ్యారు.

Congo Boat Accident : ఇంధనంతో వెళ్తున్న పడవలో మంటలు.. 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు

నదిలో పెళ్లి 'బోటు' బోల్తా.. 100 మంది మృతి.. అనేక మంది గల్లంతు

Last Updated : Oct 30, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.