ETV Bharat / international

'అలా చేస్తేనే ట్విట్టర్ డీల్.. లేదంటే క్యాన్సిల్'.. మస్క్​ బెదిరింపు!

ట్విట్టర్​ను కొనుగోలు చేసే ఉద్దేశం మస్క్​ లేనట్లు కనిపిస్తోంది. తాజాగా టెస్లా లీగల్​ టీమ్​ రాసిన లేఖ దీన్ని స్పష్టం చేస్తోంది.

Musk
మస్క్
author img

By

Published : Jun 6, 2022, 7:49 PM IST

Updated : Jun 6, 2022, 8:17 PM IST

ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందానికి ముగింపు పలికే యోచనలో టెస్లా అధినేత ఎలాన్​ మస్క్ ఉన్నట్లు కనిపిస్తోంది. 44 బిలియన్‌ డాలర్ల విలువైన వాటాను కొనుగోలు చేేసే ప్రక్రియ ఇక ముందుకు సాగనట్లే అనిపిస్తోంది. తాజాగా మస్క్​ లీగల్​ టీమ్​.. ట్విట్టర్​కు రాసిన లేఖ దీన్ని స్పష్టం చేస్తోంది. ఈ లేఖ ద్వారా ట్విట్టర్​ను మస్క్​ బెదిరించినంత పనిచేశారు. ఏకంగా ట్విట్టర్​ డీల్​నే రద్దు చేయాలనే యోచనలో మస్క్ ఉన్నట్లు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. నకిలీ ఖాతాల వివరాలను కోరుతున్నా.. ట్విట్టర్‌ నిరాకరిస్తూ వస్తోందని ఆ లేఖలో వివరించారు.

నకిలీ ఖాతాల వివరాలు కావాలని మే 9 నుంచి మస్క్‌ తరచూ కోరుతున్నారని గుర్తు చేశారు. ట్విట్టర్‌ పేలవ విధానాల గురించి సొంతంగా నిర్ధరించుకునేందుకే మస్క్‌ సమాచారాన్ని కోరారని ఆయన న్యాయవాదులు వివరించారు. ఈ ఏడాది కుదిరిన విలీన ఒప్పందం ప్రకారం తన సమాచార హక్కును ట్విట్టర్‌ అడ్డుకుంటోందని ఇటీవల ఆ కంపెనీ తమకు అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోందని వెల్లడించారు. ఇది వీలీన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని తెలిపిన ఎలాన్‌ మస్క్‌ న్యాయవాదులు ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'ట్విట్టర్​తో డీల్ కష్టమే.. అలా చేస్తేనే ముందుకు..!

Last Updated : Jun 6, 2022, 8:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.