ETV Bharat / international

మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి.. పలువురికి గాయాలు

Mosque Blast in Afghan city of Herat Several died

author img

By

Published : Sep 2, 2022, 4:16 PM IST

Updated : Sep 2, 2022, 5:27 PM IST

16:11 September 02

మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి.. పలువురికి గాయాలు

Mosque Blast in Afghanistan: అఫ్గానిస్థాన్​ హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్లు సమాచారం.

అఫ్గానిస్థాన్​ హెరాత్​ నగరంలోని ఓ మసీదులో ఉగ్రవాదులు ​మత పెద్దని లక్ష్యంగా చేసుకొని శుక్రవారం బాంబు దాడి చేశారు. ముస్లింలు ఎక్కువగా ప్రార్థనలు చేసే రోజుల్లో శుక్రవారం ఒకటి. ఈ రోజునే లక్ష్యంగా చేసుకుని.. ఉగ్రవాదు​లు పశ్చిమ నగరమైన హెరాత్​లోని ఓ మసీదులో బాంబు దాడి చేశారు. ఈ దాడిలో మత గురువుతో పాటు 18 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. వారిని హెరాత్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తాలిబన్​ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

గత రెండు దశాబ్దాలుగా మజీబ్​ ఉల్​ రెహమాన్​ అన్సారీ అనే మత గురువు అఫ్గానిస్థాన్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున అతన్ని చంపడానికే ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తాలిబన్​ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మత గురువు అన్సారీ మరణించినట్లు తాలిబన్​ అధికారి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అఫ్గానిస్థాన్​ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. తాలిబన్​లు అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టినప్పటి నుంచి.. ఇస్లామిక్​ దేశంలో షియా ముస్లింలను టార్గెట్​ చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు.

ఇవీ చదవండి : బ్రిటన్​ ప్రధాని పోరులో రిషి సునాక్​ వెనుకంజ..!

ఓవైపు వరదలు.. మరోవైపు అంటువ్యాధులు.. విలవిల్లాడుతున్న పాక్​

Last Updated : Sep 2, 2022, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.