ETV Bharat / international

సొంత బందీలను చంపిన ఇజ్రాయెల్​- శత్రువులుగా పొరపాటుపడ్డామన్న సైన్యం - ఇజ్రాయెల్​ హమాస్ యుద్ధం

Israeli Hostages Killed : శత్రువులుగా పొరపాటుపడి హమాస్‌ చెరలో బందీలుగా ఉన్నవారిలో ముగ్గురిని ఇజ్రాయెల్‌ సైన్యం కాల్చి చంపింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ స్వయంగా వెల్లడించింది.

Israeli Hostages Killed
Israeli Hostages Killed
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 7:35 AM IST

Israeli Hostages Killed : హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాపట్టిలో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శుక్రవారం పొరపాటున ముగ్గురు బందీలను చంపినట్లు తెలిపింది. హమాస్‌పై తమ దళాలు భీకర పోరాటం చేస్తున్న షిజయ్యాలోని గాజా సిటీలో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది. బందీలను ముప్పుగా భావించిన తమ దళాలు కాల్పులు జరపడం వల్ల వారు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్‌ సైనిక ప్రధాన అధికార ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. హమాస్ నుంచి బందీలు తప్పించుకున్నారా లేక మిలిటెంట్లే విడిచిపెట్టారా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరోసారి తప్పు జరగకుండా భూతల దాడుల్లో నిమగ్నమైన దళాలకు సూచనలు చేసింది. మృతి చెందిన వారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫార్‌ అజా ప్రాంతానికి చెందిన యోటమ్‌ హైమ్‌ కాగా, మరొకరిని కిబుట్జ్‌ నిర్‌ అమ్‌ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించింది సైన్యం. మూడో వ్యక్తి పేరును కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచింది.

హమాస్‌ మిలిటెంట్లు అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి సుమారు 1,200 మందికిపైగా అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్నారు. మరో 240 మందిని అపహరించి బందీలుగా చేసుకున్నారు. దీంతో ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌ హమాస్‌ స్థావరంగా చేసుకున్న గాజాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు సుమారు 18,700 మందికిపైగా మృతి చెందినట్లు హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు గాజాలో యుద్ధాన్ని ఆపాలని అంతర్జాతీయ సంస్థలు, కనీసం మానవతా సాయం కొనసాగించేందుకు వీలుగా యుద్ధ తీవ్రతను తగ్గించమని అమెరికా సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌ను విజ్ఞప్తి చేస్తున్నాయి. కాగా, హమాస్‌పై విజయం సాధించేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు.

మేం ఇజ్రాయెల్​ పక్షమే : అమెరికా
మరోవైపు హమాస్​కు జరుగుతున్న యుద్ధంలో తాము ఇజ్రాయెల్‌ పక్షానే ఉంటామని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అధ్యక్షుడు బైడెన్‌ ప్రతినిధిగా టెల్‌ అవీవ్‌ వచ్చి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును కలిసిన అమెరికా భద్రతా సలహాదారుడు జేక్‌ సలివాన్‌ శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని మరోసారి స్పష్టం చేశారు. అయితే పౌరుల ప్రాణాలకు ఎక్కువ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పౌరుల ప్రాణాలను హమాస్‌ మానవకవచాలుగా వాడుకుంటోందని, ఆసుపత్రులు, పాఠశాలల వెనుక దాక్కొని దాడులు చేస్తోందని తెలిపారు.

హమాస్​తో యుద్ధం​- ఆ రెండు దేశాల ఫార్ములాకు ఇజ్రాయెల్ నో- అమెరికా, బ్రిటన్ ఎస్

గాజాలో తీవ్ర ఆహార కొరత- నీళ్ల కోసం ట్రక్కులు లూటీ- తుపాకీల మధ్య తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.