ETV Bharat / international

'సైఖోమ్‌.. నువ్వో లెజెండ్‌'.. మీరాబాయి చానుపై హాలీవుడ్ స్టార్ ప్రశంసలు - వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను

Mirabai Chanu: బర్మింగ్​హామ్ వేదికగా జరుగుతున్న తొలి బంగారు పతకం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుపై హాలీవుడ్‌ స్టార్‌ ప్రశంసలు కురిపించాడు. 'థోర్‌' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ ప్రశంసలు కురిపించారు. ఇందుకు ఆమె యోగ్యురాలు అంటూ కొనియాడారు.

Mirabai Chanu
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/06-August-2022/16028143_5785.jpg
author img

By

Published : Aug 6, 2022, 4:22 AM IST

Updated : Aug 6, 2022, 7:05 AM IST

Mirabai Chanu: ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. 49 కిలోల విభాగంలో స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ 201 కేజీల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించింది. కాగా చానుపై హాలీవుడ్‌ స్టార్‌, 'థోర్‌' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ ప్రశంసలు కురిపించారు. ఇందుకు ఆమె యోగ్యురాలు అంటూ కొనియాడారు.

పసిడి పతకం సాధించిన అనంతరం చాను ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బరువులు ఎత్తడాన్ని ఉద్దేశిస్తూ సౌరభ్‌ సిన్హా అనే యూజర్ ఆమె ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ .. 'థోర్‌ తన సుత్తిని వదులుకునే సమయం వచ్చింది' అంటూ ట్వీట్‌ చేశాడు. దాన్ని క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశాడు. కాగా దీనిపై హాలీవుడ్‌ స్టార్‌ స్పందిస్తూ.. సిక్కింకు చెందిన చానును ప్రశంసించారు. 'ఆమె యోగ్యురాలు. కంగ్రాట్స్‌ సైఖోమ్‌. నువ్వో లెజెండ్‌' అంటూ ట్వీట్‌ చేశారు. థోర్‌ సినిమాల్లో ప్రత్యేకమైన సుత్తితో హేమ్స్‌వర్త్‌ కనిపించిన విషయం తెలిసిందే. ఆ సుత్తిని ఎత్తగల ప్రత్యేక శక్తులు అతడికే ఉంటాయి.

ఇవీ చదవండి: మలైకా అరోరా మినీ డ్రెస్​.. వామ్మో అంత ధరా!

'కరోనా నుంచి కోలుకున్నా.. కష్టంగానే

Last Updated : Aug 6, 2022, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.