ETV Bharat / international

పద్మభూషణ్ అందుకున్న సుందర్ పిచాయ్.. భారత ప్రజలకు కృతజ్ఞతలు - పద్మభూషణ్ సుందర్ పిచాయ్

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత మూడో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మభూషణ్​ను అందుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయత ఎప్పటికీ తనతో పాటే ఉంటుందని స్పష్టం చేశారు.

Sundar Pichai padma bhushan
Sundar Pichai padma bhushan
author img

By

Published : Dec 3, 2022, 8:00 AM IST

భారతీయత తనలో భాగమని, ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకెళ్తానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన ఆయన... ఇందుకు భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్​జిత్ సింగ్ సంధూ.. సుందర్ పిచాయ్​కు భారతదేశ మూడో అత్యున్నత పురస్కారాన్ని అందించారు.

Google CEO Sundar Pichai padma bhushan award
పద్మభూషణ్ అందుకుంటున్న సుందర్ పిచాయ్

"నన్ను ఇలా తీర్చిదిద్దిన దేశం నుంచి ఈ విధంగా గౌరవం పొందడం చాలా గొప్ప అనుభూతి. భారత ప్రభుత్వానికి, ప్రజలకు నేను కృతజ్ఞతతో ఉన్నా. ఈ అవార్డును నేను సురక్షితంగా ఎక్కడైనా పెట్టేస్తా. కానీ భారతీయత ఎప్పటికీ నాలో భాగంగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా దాన్ని(భారతీయతను) నా వెంట తీసుకెళ్తా" అని పిచాయ్ పేర్కొన్నారు. తన కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని పిచాయ్ గుర్తు చేసుకున్నారు. ఎన్నో విషయాలు నేర్పించిన అలాంటి కుటుంబంలో పెరగడం అదృష్టమని అన్నారు.

Sundar Pichai padma bhushan
పద్మభూషణ్ అందుకుంటున్న సుందర్ పిచాయ్

భారత్​కు తాను అనేక సార్లు వచ్చానని చెప్పిన సుందర్ పిచాయ్.. సాంకేతిక విషయంలో దేశంలో వేగవంతమైన మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు. భారత్​లోని ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. "డిజిటల్ ట్రాన్స్​ఫార్మేషన్ విషయంలో అనేక అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు సైతం ఇప్పుడు అంతర్జాలం అందుబాటులో ఉంటోంది. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా విజన్.. అభివృద్ధికి ఊతం కలిగించేదే. గూగుల్​తో భారత్​కు ఉన్న బంధాన్ని కొనసాగించేందుకు నేను ఎదురుచూస్తున్నా. మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం" అని చెప్పారు. ఈ సందర్భంగా.. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతించారు పిచాయ్.

సంధూతో ముచ్చట

ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలకు డిజిటల్ ఉత్పత్తులు, నైపుణ్యాలను అందుబాటులో తెస్తున్నందుకు పిచాయ్​ను అభినందించారు సంధూ. భారత్​లో ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకోవాలని గూగుల్​కు పిలుపునిచ్చారు.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.