ETV Bharat / international

'అప్పటి నుంచి ఆయన నా ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదు' - రిషి సునాక్ న్యూస్

Rishi Sunak: బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్​.. మాజీ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసినప్పటినుంచి జాన్సన్‌ తన మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదని రిషి వెల్లడించారు.

Rishi Sunak
Rishi Sunak
author img

By

Published : Aug 13, 2022, 7:14 AM IST

తాను రాజీనామా చేసినప్పటినుంచి బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్‌ వెల్లడించారు. ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఇంగ్లాండ్‌లోని చెల్టెన్‌హామ్‌లో టోరీ సభ్యులతో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీగేట్‌ కుంభకోణంలో బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంటును తప్పుదోవ పట్టించారా? లేదా? అన్న విషయంపై కొనసాగుతోన్న పార్లమెంటరీ విచారణపై సునాక్‌ అభిప్రాయాన్ని కోరగా.. 'ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియ. ప్రభుత్వ ప్రక్రియ కాదు. కామన్స్‌ ప్రివిలెజెస్‌ కమిటీలోని ఎంపీలను గౌరవిస్తా. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు' అని బదులిచ్చారు.

'వ్యక్తిగతంగా నేను ఉన్నత ప్రమాణాలను విశ్వసిస్తా. ప్రధానమంత్రి అయిన వెంటనే నేను మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని తిరిగి నియమిస్తాను. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాదలు.. రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలు' అని పేర్కొన్నారు. దీంతో టోరీ సభ్యులనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. శుక్రవారం వేల్స్ పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు సునాక్‌ సందేశాలు, ఫోన్‌ కాల్స్‌ విషయమై ప్రశ్నలు ఎదురుకాగా.. ఆయన వాటిని దాటవేశారు. బోరిస్‌ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయానని చెబుతూ.. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునాక్ తన పదవికి రాజీనామా చేశారు. తదనంతర పరిణామాలు బోరిస్‌ రాజీనామాకు దారితీశాయి. ప్రస్తుతం ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ తుది పోటీలో ఉన్నారు.

ఇవీ చదవండి: ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు

సాయుధుడి కాల్పులు.. 11 మంది మృతి.. కుటుంబ కలహాలతోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.