ETV Bharat / international

అమెరికాలో కాల్పుల్లో ఆర్నెళ్ల చిన్నారి సహా ఆరుగురి మృతి.. రోడ్డు ప్రమాదంలో 19 మంది.. - సెనెగల్​ రోడ్డు ప్రమాదం 19 మృతి

అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో 6 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఓ తల్లితో పాటు 6 నెలల చిన్నారి ఉన్నారు. సెనగల్​ జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు.

america california shooting
america california shooting
author img

By

Published : Jan 17, 2023, 6:54 AM IST

Updated : Jan 17, 2023, 7:28 AM IST

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని విసాలియా​ సిటీలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇందులో ఓ మహిళతోపాటు ఆమె ఆరు నెలల చిన్నారి మరణించారు. ఉదయం 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో కాల్పులు జరుగుతన్నాయనే సమాచారం వచ్చిందని తులారే కౌంటీ అధికారి షెరిఫ్​ వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై వెళ్లగా.. ఆ ఇంట్లో ఐదు మృతదేహాలను గుర్తించామని.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు తెలిపారు. ఆ వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికి మరణించాడని చెప్పారు.
కాగా, ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి సాధారణంగా జరిగిన హత్యలు కావని.. ఓ కుటంబాన్ని టార్గెట్​ చేసుకుని హత్యచేశారని తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి..
పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ బస్సు.. గాడిదను తప్పించబోయి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ఇంకా చాలా మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఎన్​గెన్​ సార్​ ప్రాంతంలో జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై సెనెగల్​ అధ్యక్షుడు మాకీ సాల్​ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

కాంగోలో బాంబు దాడి.. బాధ్యత వహించిన ఇస్లామిక్​ స్టేట్
ఆఫ్రికా దేశం కాంగోలోని కాసింది టౌన్​లో ఉన్న ఓ చర్చి​పై ఆదివారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. దాదాపు 63 మంది గాయపడ్డట్లు అధికాలు తెలిపారు. కాగా, దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్​ స్టేట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 'కాంగోలీస్​ భద్రత దళాలు ముజాహిద్దీన్​పై చేస్తున్న దాడులు వారికి ఓటమిని, నష్టాన్ని చేకూరుస్తాయి.' అని ప్రకటనలో పేర్కొంది. బాంబు దాడిలో 20 మంది క్రైస్తవులను చంపినట్లు వెల్లడించింది. కాగా, 14 మందే చనిపోయారని కాంగో అధికారులు చెబుతున్నారు.

Last Updated : Jan 17, 2023, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.