ETV Bharat / international

పరీక్షలు అయిపోయాయని విద్యార్థుల పార్టీ.. 21 మంది మృతి!

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్​ క్లబ్​లో దారుణం జరిగింది. 21 మంది విద్యార్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు. పరీక్షలు అయిపోయాయని ఆనందంతో విద్యార్థులు పార్టీ చేసుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

South African nightclub while celebrating end of exams

author img

By

Published : Jun 26, 2022, 3:30 PM IST

Updated : Jun 27, 2022, 7:08 AM IST

South African nightclub: నైట్​ క్లబ్​ లోపల 21 మంది విద్యార్థులు విగతజీవులుగా కనిపించిన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈస్ట్​ లండన్​లోని సీనరీ పార్క్​ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుల్లో చాలా మంది 13 ఏళ్లలోపు వారే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షలు అయిపోయాయని ఆనందంతో.. విద్యార్థులు పార్టీ చేసుకుంటున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది.

వారి మృతికి స్పష్టమైన కారణం తెలియకపోయినప్పటికీ తొక్కిసలాట లేదా విషప్రభావానికి గురయ్యారని అనుమానిస్తున్నారు. మృతదేహాలు నైట్​ క్లబ్​లోని టేబుల్స్​ సహా నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లబ్​ బయట భారీగా జనం గుమిగూడారు.

ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రామపోసా. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. విద్యార్థుల మృతికి గల కారణాలను తెలుసుకుని కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Last Updated : Jun 27, 2022, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.