Boy fell from 29th floor: అమెరికాలోని ఆకాశహర్మ్యాల నగరమైన న్యూయార్క్‌లో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడు ఎత్తైన భవనం పైనుంచి కిందపడి మరణించాడు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. హర్లీమ్ ప్రాంతంలో ఉన్న.. టైనో టవర్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. బాలుడు 29వ అంతస్తులోని ఓ కిటికీ నుంచి పడిపోయాడని పోలీసులు చెప్పారు.
'ఉదయం 11.09కి మాకు సమాచారం అందింది. బాలుడు మూడో అంతస్తు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంపై పడిపోయాడు. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధరించారు. కిటికీలో నుంచి బాలుడు బయటకు వచ్చాయని అనుమానిస్తున్నాం. అయితే, అలా ఎలా వచ్చి ఉంటాడన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. బాలుడు పడిపోయినప్పుడు ఇంట్లో ఉన్న ఇద్దరిని ప్రశ్నిస్తున్నాం' అని అధికారులు చెప్పారు.
'ఓ మహిళ గట్టిగా అరవడం నేను విన్నా. ఆమె ఆ బాలుడి తల్లి అయి ఉంటుంది. బయటకు చూసేసరికి ఓ చిన్నారి.. కింద పడినట్లు తెలిసింది' అని 34వ అంతస్తులో ఉంటున్న ఓ మహిళ చెప్పారు. 'ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. బాలుడిని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నించారు. తాత్కాలిక నిర్మాణం వద్దకు వెళ్లి బాలుడిని గుర్తించాం. అతడు అప్పటికీ ఏడుస్తున్నాడు. శ్వాస ఆడుతోంది. పారామెడికల్ సిబ్బంది కిందకు దించారు' అని స్థానికులు వివరించారు.
జాగ్రత్తలు పాటించలేదా?
మూడు కన్నా ఎక్కువ అపార్ట్మెంట్లు ఉన్న భవన యజమానులు.. కిటికీలకు తప్పనిసరిగా అద్దాలు అమర్చాలనే నిబంధన న్యూయార్క్‌లో ఉంది. పదేళ్ల లోపు చిన్నారులు ఆ భవనాల్లో నివసిస్తే ఈ నిబంధన అమలు చేస్తారు. అయితే, ఘటన జరిగిన భవనం కిటికీలకు అద్దాలు అమర్చారో లేదో తెలియలేదు.
ఇదీ చదవండి: