Ukraine Crisis: ఉక్రెయిన్పై గత 13 రోజులుగా క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ఆ దేశంలోని కీలక నగరాను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి రష్యన్ సేనలు. అయితే.. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ప్రతిఘటిస్తోంది. రష్యా సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ సవాల్ విసురుతోంది. తాజాగా.. ఉక్రెయిన్ చేసిన దాడిలో రష్యా మేజర్ జనరల్ మృతి చెందారు.
ఖర్కివ్ సమీపంలో తమ బలగాలు జరిపిన దాడుల్లో రష్యా 41వ ఆర్మీ బెటాలియన్ అధిపతి, డిప్యూటీ కమాండర్, మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ చనిపోయినట్లు ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. ఈ దాడిలో మరికొంత మంది అధికారులు చనిపోయారని, కొందరికి గాయాలు అయ్యాయని పేర్కొంది.
ఇదీ చూడండి: విరామం అంటూనే.. ఉక్రెయిన్పై రష్యా బాంబుల మోత