polymer solution for corona:వస్త్రాల ద్వారా కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు సరికొత్త పదార్థాన్ని తయారు చేశారు. దీన్ని వస్త్రాలపై పూతగా వాడితే, కొవిడ్ ముప్పు 90% వరకూ తగ్గుతుందని వెల్లడించారు.
పరిశోధకులు మొదట బ్యాక్టీరియాను నాశనంచేసే పాలిమర్ ద్రావణంలో వస్త్రాన్ని నానబెట్టారు. తర్వాత దీనిపై కాంతిని ప్రసరింపజేయగా, క్రిమిరహితంచేసే అణువులు విడుదలయ్యాయి. అనంతరం యూవీ కిరణాల సాయంతో ఈ ద్రావణం వస్త్రానికి గట్టిగా అతుక్కుపోయేలా చేశారు. ఈ పదార్థాన్ని మొదటిసారి ఉపయోగించినప్పుడు మాత్రమే కాకుండా... ఆ తర్వాత వస్త్రానికి సూర్యకాంతి తగిలినప్పుడు కూడా క్రిములు నాశనమవుతాయని పరిశోధనకర్త మైకేల్ వోల్ఫ్ వివరించారు.
"సూక్ష్మక్రిములు వస్త్రానికి అతుక్కోకుండా చేసే ఈ పదార్థాన్ని తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల మనిషికి ఎలాంటి హానీ ఉండదు. కాటన్, పాలిస్టర్, సిల్క్, డెనిమ్ తదితర రకాలన్నింటికీ చాలా అనువుగా ఉంటుంది. ఆసుపత్రుల్లోని కర్టెన్లు, దుప్పట్లు, తలగడలు, మాస్కులకు కూడా ఈ ద్రావణాన్ని పూతగా వాడొచ్చు"
- పరిశోధకులు
భవిష్యత్తులో సమర్థవంతమైన యాంటీవైరల్ స్ప్రేల తయారీకి ఈ పరిశోధన దోహదపడగలదని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: