కరోనా మహమ్మారికి ప్రస్తుతానికి పూర్తి స్థాయి పరిష్కారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథి టెడ్రోస్ అథనోమ్ స్పష్టం చేశారు. ఎప్పుడు లభిస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే చాలా వ్యాక్సిన్లు మూడో దశ ప్రయోగాల్లో ఉన్నట్లు తెలిపారు టెడ్రోస్. ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయని భావిస్తు్న్నట్లు చెప్పారు.
కరోనా వైరస్ విపత్తుపై అత్యవసర కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి 3 నెలల కాలంలో 5 రెట్లకుపైగా కేసులు నమోదయ్యాయని టెడ్రోస్ తెలిపారు. మరణాల సంఖ్య మూడు రెట్లు పెరిగి 6.8 లక్షలకు చేరిందని వివరించారు.