మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీ దంపతులు మరోమారు తల్లిదండ్రులయ్యారు. మేఘన్ మార్కెల్ శుక్రవారం రెండో బిడ్డకు జన్మనిచ్చారని ఓ అధికారి తెలిపారు. ఆదివారం ఈ పాపకు 'లిల్లీబెట్ లిలీ డయానా'గా నామకరణం చేసినట్లు ప్రిన్స్ హ్యారీ అధికార ప్రతినిధి తెలిపారు. పాప బరువు 7 పౌండ్లు(3.175 కిలోలు) ఉన్నట్లు చెప్పారు. అయితే.. ఈ పాప ఫొటోలు ఇంకా బహిర్గతం కాలేదు.
తాను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగిందని మార్చి నెలలో ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో మేఘన్ మార్కెల్ చెప్పిన నేపథ్యంలో.. తాజాగా ఆమెకు బిడ్డ పుట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మనవడు అయిన ప్రిన్స్ హ్యారీ.. 2018లో అమెరికా నటి మేఘన్ మర్కెల్ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు.
ఇవీ చూడండి: