ETV Bharat / international

రష్యా, జర్మనీపై కొవిడ్ పంజా- మరణాలు, కేసుల్లో కొత్త రికార్డులు

జర్మనీపై(Germany covid cases) కొవిడ్ పంజా విసురుతోంది. రికార్డుస్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా టీకా తీసుకోని ప్రభుత్వ అధికారులపై సింగపూర్(Singapore covid cases) ప్రభుత్వం దృష్టి సారించింది. వారిని అన్​పెయిడ్ లీవ్ కేటగిరీకి మారుస్తామని హెచ్చరించింది.

new coronavirus cases
జర్మనీలో కొవిడ్ పంజా
author img

By

Published : Nov 4, 2021, 4:25 PM IST

Updated : Nov 4, 2021, 6:36 PM IST

జర్మనీలో(Germany covid cases) కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 33,949 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 165 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. జర్మనీలో కొవిడ్​-19 వైరస్​ ప్రబలినప్పటినుంచీ ఈ స్థాయిలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారన్నారు.

జర్మనీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న క్రమంలో ఆ దేశ వైద్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్.. 16 రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ విజృంభణ, ఐసీయూ పడకల సామర్థ్యంపై చర్చించనున్నారు. దేశంలో ఇంకా వ్యాక్సిన్ తీసుకోనివారు.. వెంటనే టీకా వేసుకోవాలని సీనియర్ వైద్యఅధికారులు సూచిస్తున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం జర్మనీలో ఇప్పటివరకు 8కోట్ల 30లక్షలమంది కొవిడ్ వ్యాక్సిన్​ మొదటి డోస్(Germany vaccine update) తీసుకున్నారు.

రష్యాలో రికార్డు స్థాయిలో మరణాలు..

రష్యాలో కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది. బుధవారం ఒక్కరోజే దేశంలో 1,195 మంది వైరస్​ బారినపడి మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు 1,189 మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. సెప్టెంబరు చివరివారం నుంచి రష్యాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

ప్రపంచంలోని చాలా దేశాలకంటే ముందే రష్యా.. కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినా.. ఇప్పటివరకు ఆదేశ జనాభాలో 35శాతం కంటే తక్కువమందికే వ్యాక్సినేషన్ పూర్తయింది.

ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోకపోతే..

సింగపూర్​లో(Singapore covid cases) రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు, మరణాలు సంభవిస్తున్న క్రమంలో.. ఇంకా వ్యాక్సి న్​(Singapore vaccine update) తీసుకోని ప్రభుత్వ అధికారులను అన్​పెయిడ్​ లీవ్​ కేటగిరీ కింద పరిగణిస్తామని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

దేశంలో బుధవారం ఒక్కరోజే 3,635 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 12 మంది వైరస్​తో మరణించారు.

2022, జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న లేదా కొవిడ్​-19 నుంచి కోలుకుని 270 రోజులు గడిచిన ఉద్యోగులు మాత్రమే విధుల్లో పాల్గొనాలని అక్టోబరు 23న ఆదేశించింది.

ఇదీ చూడండి: కొవాగ్జిన్​కు 'ప్రపంచ' గుర్తింపు- ఇక టీకా ఉత్పత్తి జోరు ​

Last Updated : Nov 4, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.