ETV Bharat / international

బ్రిటన్‌లో తొలి 'ఒమిక్రాన్‌' మరణం- పాక్​లో మొదటి కేసు - బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు

Omicron Death In UK: బ్రిటన్​లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్ వెల్లడించారు. మరోవైపు పాకిస్థాన్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

omicron
ఒమిక్రాన్‌
author img

By

Published : Dec 13, 2021, 5:44 PM IST

Updated : Dec 13, 2021, 6:33 PM IST

Omicron Death In UK: బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్​ జాన్సన్ వెల్లడించారు.

బ్రిటన్​లో తొలి మరణం నమోదుతో.. దేశ ప్రజలు అప్రమత్తమయ్యారు. బూస్టర్ డోసు తీసుకునేందుకు ప్రజలు వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద బారులు తీరారు. ఓ వ్యాక్సిన్​ క్లినిక్​కు వెళ్లిన బ్రిటన్ ప్రధాని జాన్సన్​.. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్​ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరికీ బూస్టర్ డోసులు అందించనున్నట్లు తెలిపారు.

పాక్​లో తొలి ఒమిక్రాన్ కేసు..

పాకిస్థాన్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు ఇస్లామాబాద్​లోని జాతీయ వైద్య విశ్వవిద్యాలయం తెలిపింది. కరాచీకి చెందిన 57ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు అధికారులు. ప్రజలు.. కొవిడ్ వేరియంట్ల బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్​ తీసుకోవాలన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ 63 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఇటీవల తెలిపింది. కరోనా రెండో దశలో విధ్వంసం సృష్టించిన డెల్టా వేరియంట్​ను ఇది త్వరలోనే అధిగమించవచ్చని అంచనా వేసింది. కొత్త వేరియంట్ ఇంత వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతుందో ఇంకా తెలియదని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం డెల్టా కంటే ఈ వేరియంట్​ తక్కువ ప్రమాదకారి అని అభిప్రాయపడింది డబ్ల్యూహెచ్​ఓ. ఒమిక్రాన్​పై వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించి సరైన సమాచారం లేదని తెలిపింది.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కరోనా- త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్​

Last Updated : Dec 13, 2021, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.