ETV Bharat / international

తాలిబన్లపై ధిక్కార స్వరం- ప్రధాన నగరాల్లో ప్రజల నిరసనలు! - పౌరులపై తాలిబన్ కాల్పులు

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అఫ్గానిస్థాన్ జాతీయ జెండాతో నిరసనకు దిగిన పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది.

TALIBAN KILLED 2 PROTESTORS
అఫ్గాన్ పౌరులపై తాలిబన్ల కాల్పులు
author img

By

Published : Aug 18, 2021, 3:48 PM IST

Updated : Aug 18, 2021, 4:13 PM IST

దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని అఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్​లో అఫ్గాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారని వార్తలు వస్తున్నాయి. తాలిబన్ల కాల్పుల్లో మరో 10 మంది గాయపడ్డారని పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.

మరోవైపు, తమ హక్కులను కాపాడాలంటూ మహిళలు పోరాటానికి దిగారు. రాజధాని నగరమైన కాబుల్​లో నలుగురు మహిళలు నిరసన చేపట్టారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 18, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.