ETV Bharat / international

5,800 ఆవులతో వెళ్తూ మునిగిన నౌక

తూర్పు చైనా సముద్రంలో మునిగిపోయిన ఓ పశువుల నౌక కోసం జపాన్ నావికాదళం గాలింపు చేపట్టింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఓడ సిబ్బంది ద్వారా ఈ విషయం తెలిసిందని అధికారులు వెల్లడించారు. న్యూజిలాండ్​ నుంచి 42 మంది సిబ్బంది, దాదాపు 6 వేల ఆవులతో చైనా వస్తోన్న నౌక.. తుపాను కారణంగా మునిగిపోయినట్లు భావిస్తున్నారు.

ship goes missing
పశువుల నౌక
author img

By

Published : Sep 3, 2020, 1:29 PM IST

న్యూజిలాండ్ నుంచి చైనాకు పశువులను తీసుకెళుతున్న నౌక.. జపాన్​ సమీపంలో మునిగిపోయింది. ఆ సమయంలో ఆ నౌకలో 42 మంది సిబ్బంది, 5,800 ఆవులు ఉన్నాయి.

ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయడపడ్డ ఓడ సిబ్బందిలో ఒకరిని జపాన్​ నావికాదళం కాపాడింది. అతనిచ్చిన సమాచారం ప్రకారం తూర్పు చైనా సముద్రంలో మునిగిపోయిన ఓడ కోసం గాలింపు చేపట్టారు.

ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, మేసాక్​ తుపాను కారణంగా ఆ ప్రాంతంలో వాతావరణం సంక్లిష్టంగా ఉందని జపాన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందని, గాలింపు కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కొరియాలో మేసాక్ తుపాను బీభత్సం

అలా తెలిసింది...

జపాన్​ దక్షిణ ద్వీపం సమీపంలో నీటిలో లైఫ్ జాకెట్​​ సాయంతో తేలియాడుతున్న సిబ్బందిని నౌకాదళం నిఘా విమానం పీ-3సీ గుర్తించింది. అనంతరం అతనని తీరప్రాంత గస్తీ సిబ్బంది కాపాడారు. ​ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఫిలిప్పీన్స్​కు చెందినవాడని జపాన్ అధికారులు తెలిపారు. అతను ఆరోగ్యంగానే ఉన్నాడని, నౌక ప్రమాదం గురించి అతడే సమాచారం ఇచ్చాడని స్పష్టం చేశారు.

ఓడలో 42 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 38 మంది ఫిలిప్పీన్స్​కు చెందినవారు కాగా.. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా దేశస్థులు ఇద్దరు చొప్పున ఉన్నారు.

నేపియర్​ నుంచి బయలుదేరి..

మునిగిపోయిన ఓడ.. యూఏఈకి చెందిన గల్ఫ్ నేవిగేషన్​కు చెందినదిగా గుర్తించారు. న్యూజిలాండ్​లోని నేపియర్ నౌకాశ్రయం నుంచి 5,800 ఆవులతో ఆగస్టు రెండోవారంలో బయలుదేరింది. చైనా తూర్పు తీరంలోని తాంగ్​షాన్​ ఓడరేవును చేరుకోవాల్సి ఉంది.

ఇదీ చూడండి: అమెరికానే తలదన్నేలా.. చైనా 'అణు' ప్రణాళికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.