ETV Bharat / international

హఫీజ్​ సయీద్​ ఇంటి బయట పేలుడు- నలుగురికి మరణశిక్ష - పాకిస్థాన్

Hafiz Saeed: ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి ఆవరణలో గతేడాది జరిగిన బాంబ్ బ్లాస్ట్​ కేసులో తీర్పు వెల్లడించింది పాకిస్థాన్​ కోర్టు. ఈ వ్యవహారానికి సంబంధమున్న నలుగురు వ్యక్తులకు మరణశిక్ష విధించింది.

hafiz saeed
ayesha bibi
author img

By

Published : Jan 13, 2022, 5:20 AM IST

Updated : Jan 13, 2022, 7:24 AM IST

Hafiz Saeed: పాకిస్థాన్​లోని తీవ్రవాద వ్యతిరేక కోర్టు నలుగురు వ్యక్తులకు బుధవారం మరణశిక్ష విధించింది. వీరు ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి ఆవరణలో గతేడాది జూన్​లో జరిగిన శక్తిమంతమైన కారుబాంబు పేలుడు కేసులో నిందితులు. జోహర్​ పట్టణంలో జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. చుట్టుపక్కల పలువురి ఇళ్లు, దుకాణాలు, వాహనాలు దెబ్బతిన్నాయి.

అత్యంత భద్రత నడుమ కోట్ లఖ్పత్ జైలులో జరిగిన ఇన్​-కెమేరా విచారణలో ఆయేషా బీబీ అనే మరో మహిళకు తీవ్రవాద వ్యతిరేక కోర్టు జడ్జి అర్షద్ హుసేన్ భుట్టా.. అయిదేళ్ల జైలు శిక్ష విధించారు. తీవ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేసిన కేసుల్లో సయూద్ జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు పాక్ అధికారులు చెబుతున్నా.. కారుబాంబు పేలుళ్ల సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: హఫీజ్​ సయీద్ అనుచరులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు

Last Updated : Jan 13, 2022, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.