భారతదేశానికి చెందిన ఓ నిఘా క్వాడ్‌కాప్టర్‌ను కూల్చివేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి గగనతల సరిహద్దులను ఉల్లంఘిస్తూ... పాక్ భూభాగంలోకి చొచ్చుకురావడం వల్లనే క్వాడ్‌కాప్టర్‌ను కూల్చివేసినట్లు తెలిపింది. ఈ ఘటన నియంత్రణ రేఖలోని హాట్ స్ప్రింగ్ సెక్టార్లో జరిగినట్లు పేర్కొంది.
"భారత్‌కు చెందిన నిఘా క్వాడ్‌కాప్టర్ నియంత్రణరేఖ దాటి 850 మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకువచ్చింది. అందుకే దానిని కూల్చేశాం. ఈ సంవత్సరం పాక్ సైనిక దళాలు కూల్చిన తొమ్మిదో భారత నిఘా డ్రోన్ ఇది."
- పాక్ సైన్యం
తోసిపుచ్చిన భారత్
పాకిస్థాన్ సైన్యం గతంలో కూడా ఇలాంటి వాదనలే (క్వాడ్కాప్టర్లు కూల్చడం) చేసింది. అయితే భారత్ వాటిని తోసిపుచ్చింది.
పుల్వామా దాడితో..
ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సిబ్బంది మరణించారు. దీనికి కారణమైన పాకిస్థాన్ ఆధారిత జైషే మహమ్మద్ శిక్షణా శిబిరంపై భారత వాయుదళం బాంబుల వర్షం కురిపించి, నాశనం చేసింది. ప్రతీకారంగా ఫిబ్రవరి 27 భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులకు పాల్పడింది. దీనితో భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆర్టికల్ 370 రద్దు
గత ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని కూడా పాకిస్థాన్ వ్యతిరేకించింది. దీనితో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: 'నన్ను పదవి నుంచి దించేందుకు భారత్ యత్నం'