ETV Bharat / international

80 ఆస్పత్రులు తిరిగినా ఆ రోగికి నో ఎంట్రీ! - Covid-19 latest updates

జపాన్​లో కరోనా విజృంభణతో వైద్య వ్యవస్థపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. కరోనా లక్షణాలతో తీవ్రంగా బాధపడుతున్న వ్యక్తిని చేర్చుకునేందుకు 80 ఆసుపత్రులు నిరాకరించాయంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నాణ్యమైన వైద్య సేవలకు ప్రసిద్ధి చెందిన జపాన్​లో ఈ పరిస్థితి ఎందుకు?

VIRUS-JAPAN
ఆంబులెన్సుకు నో ఎంట్రీ
author img

By

Published : Apr 18, 2020, 12:34 PM IST

అది టోక్యో. అక్కడ ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నాడు. వెంటనే అంబులెన్స్​లో ఆస్పత్రికి వెళ్లాడు. కానీ... అతడ్ని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. చేసేది లేక... అదే అంబులెన్స్​లో మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి. అలా ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 80 ఆస్పత్రులు తిరిగాడు. ఏ చోటా అతడికి చేరేందుకు అనుమతి లభించలేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనే అలా తిరుగుతూ నగర శివార్లకు చేరుకున్నాడు ఆ రోగి. చివరకు ఓ ఆస్పత్రిలో చేరాడు.

మరో వ్యక్తికి ఇదే పరిస్థితి ఏర్పడింది. 40 ఆసుపత్రులు అతడికి చికిత్స చేసేందుకు నిరాకరించాయి.

నెలలో 931 సార్లు..

మార్చిలో 931 సార్లు ఆంబులెన్సులను 5 కన్నా ఎక్కువ ఆసుపత్రులు తిరస్కరించిన ఘటనలు జరిగాయి. వీరంతా అత్యవసర సేవలు పొందేందుకు కనీసంగా 20 నిమిషాలు పట్టినట్లు అంచనా. ఏప్రిల్​ నెలలో తొలి 11 రోజుల్లోనే 830 ఘటనలు జరిగినట్లు టోక్యో అగ్నిమాపక శాఖ తెలిపింది.

ఎందుకిలా?

ఎందుకు ఇలా? అన్ని రంగాల్లో ఎంతో ముందు ఉందని చెప్పుకునే జపాన్​ రాజధానిలోనే ఎందుకింతటి దుస్థితి? సమాధానం ఒక్కటే... కరోనా విజృంభణ.

VIRUS-JAPAN
జపాన్​లో కేసుల వివరాలు

లాక్​డౌన్​ అమలు చేస్తున్నా జపాన్​లో ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది రాకాసి వైరస్. ఫలితంగా అక్కడి వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. చాలా ఆసుపత్రులు అత్యవసర సేవలను నిలిపివేశాయని జపాన్​ వైద్య సంఘాలు తెలిపాయి. గుండెపోటు వంటి తీవ్రమైన కేసులనూ స్వీకరించట్లేదని వెల్లడించాయి.

బయటపడ్డ బలహీనతలు..

బీమాతో నాణ్యత, ఖర్చు విషయంలో చాలా కాలంగా ప్రశంసలు అందుకుంటున్న జపాన్ వైద్య వ్యవస్థలో.. ఈ పరిస్థితి అంతర్లీనంగా ఉన్న బలహీనతలను ఎత్తి చూపిస్తోంది. టోక్యో, ఒసాకా వంటి నగరాలు భౌతిక దూరం నిబంధనను పక్కాగా అమలు చేయడంలో విఫలమయ్యాయి.

స్వల్ప లక్షణాలు ఉన్నవారు కూడా చేరటం వల్ల ఆసుపత్రులు రద్దీగా మారాయి. ఫలితంగా జపాన్‌లో ఆసుపత్రి పడకలు, సిబ్బంది కొరత ఏర్పడింది. వైద్య పరికరాలు, పీపీఈలు సరిపడా లేకపోవడం మరో సమస్య. ఈ ప్రభావంతో కొత్తవారిని చేర్చుకునేందుకు విముఖత చూపిస్తున్నాయి ఆసుపత్రులు.

పరికరాల కొరత..

వ్యక్తిగత సంరక్షణ పరికరాల(పీపీఐ) కొరత కూడా జపాన్​ను వేధిస్తోంది. ఆరోగ్య సిబ్బంది ఎన్-95 మాస్కులను రెండు, మూడు సార్లు ఉపయోగిస్తున్నారు. ఒసాకా నగరంలో రెయిన్​కోట్లను హజ్మత్​ సూట్లుగా వాడుతున్నారు.

జపాన్​లో ఇంటెన్సివ్​ విభాగాలు లక్ష మందిలో ఐదుగురికి మాత్రమే ఉన్నాయి. దేశంలో కేసులు భారీగా పెరిగితే.. వెంటిలేటర్ల కొరత కారణంగా 4 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వైరస్ టాస్క్​ ఫోర్స్ హెచ్చరించింది.

ఇదీ చూడండి: ల్యాబ్​ నుంచే వైరస్​! వుహాన్​లో ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.