ETV Bharat / international

తాలిబన్ల పాలన షురూ- చక్రం తిప్పేది ఆ నలుగురే!

అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైంది. ఈ దఫా తాలిబన్ల నాయకత్వంలో ఈ నలుగురే కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు ఎవరంటే...

top Taliban leadership
ఆ నలుగురు
author img

By

Published : Aug 16, 2021, 5:36 PM IST

అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్‌లో కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న తాలిబన్లు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు. దేశ రాజధాని కాబుల్‌ను ఆక్రమించారు. ఈ పరిణామంతో అఫ్గాన్‌ పూర్తిగా తమ పాలనలోకి వచ్చినట్లైంది. ఉద్యమాన్ని నడిపించిన నాయకులే.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్నారు. అందులోనూ చక్రం తిప్పేది మాత్రం నలుగురేనని తెలుస్తోంది. వారెవరంటే..

ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్, తాలిబన్ల సహ వ్యవస్థాపకుడు

53 ఏళ్ల ముల్లా అబ్దుల్‌ ఘనీ బారదార్‌ కాందహార్ అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ నగరంలో పెరిగారు. ఈ ప్రాంతంలోనే తాలిబన్ల ఉద్యమం పురుడు పోసుకుంది. అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల సహ వ్యవస్థాపకుడుగా వ్యవహరించడమే కాదు.. అధినేత ఒంటికన్ను ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ డిప్యూటీగానూ పని చేశారు. ఒమర్‌తో కలిసి 1990లో తాలిబన్ల ఉద్యమం చేపట్టారు. 2010లో పాకిస్థాన్‌ ఇంటర్‌సర్వీస్‌ ఇంటలిజన్స్‌ (ఐఎస్‌ఐ), సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) బృందాలు ఇతనిని అరెస్టు చేశాయి. అనంతరం 2018లో అక్టోబర్‌లో విడుదలయ్యారు. ఆపై ఖతార్‌కు తరలి.. అక్కడే తాలిబన్ల రాజకీయ పార్టీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి అమెరికన్లతో కీలక చర్చలను ఆయనే పర్యవేక్షించారు.

హైబతుల్లా అఖుంజాదా, సుప్రీం లీడర్‌, ప్రధాన నాయకుడు

60ఏళ్ల హైబతుల్లా అఖుంజాదా.. తాలిబన్ల మూడో ప్రధాన నాయకుడు. మతపర వ్యవహరాలకు అధిపతి కూడా. 2016లో.. తాలిబన్ల నాయకుడు ముల్లా మన్సూర్ అక్తర్ అమెరికా అఫ్గానిస్థాన్‌పై జరిపిన దాడుల్లో ఆయన మరణించగా.. ఆయన స్థానంలో హైబతుల్లా నియమితులయ్యారు. ఆల్‌ఖైదా నేత జవహరి అతడి నమ్మకాలకు మెచ్చి.. విశ్వాసం గల వ్యక్తి అంటూ కొనియాడారు.

సిరాజుద్దీన్ హక్కానీ, హక్కానీ నెట్‌వర్క్ అధిపతి

పాక్‌ కేంద్రంగా పనిచేసే హక్కానీ నెట్‌వర్క్​కి ఇతడే నాయకుడు. సోవియట్‌ వ్యతిరేక ముజాహిదీన్‌ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్‌ హక్కానీ. తాలిబన్లకు డిప్యూటీ లీడర్‌గానూ, అమెరికన్లపై దాడి చేసేందుకు ఏర్పాటు చేసిన ఉగ్రవాది సంస్థ హక్కానీ నెట్‌వర్క్​కి అధిపతిగా ఉన్నారు. కొన్నేళ్లుగా కాబుల్‌లోని తీవ్రమైన దాడులన్నీ ఈ సంస్థ సారథ్యంలో జరిగినవే.

ముల్లా యాకూబ్, మిలిటరీ కమిషన్ల విభాధిపతి

తాలిబన్ల వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ తనయుడే ముల్లా యాకూబ్‌. ఇక్కడి మిలిటరీ కమిషన్ల విభాగాలన్నింటికీ ఈయనే అధిపతి. భవిష్యత్తులో ఇతనే సారథ్యం వహించవచ్చని నిఘావర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: Viral: విమానం నుంచి జారిపడిన అఫ్గాన్​ ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.