ఆస్ట్రేలియాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ రహదారులు చెరువులుగా మారిపోయాయి. కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. పాఠశాలలకూ సెలవులు ప్రకటించారు. వేల ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
వరద ఉద్ధృతి వల్ల నగర ఆనకట్ట గేట్లు తెరిచారు. ప్రజలను కాపాడటానికి వెళ్లిన ఇద్దరు అధికారులు వరదల్లో గల్లంతయ్యారు. రానున్న రెండు రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.