ETV Bharat / international

Panjshir Valley: 'పంజ్​షేర్'లో నిశ్శబ్దం- తుపాను ముందు ప్రశాంతతా? - తాలిబన్ న్యూస్​

తాలిబన్లపై(Afhgan Taliban) తుపాకులతో గర్జించిన పంజ్​షేర్​ లోయలో(Panjshir Valley) ఇప్పుడు శాంతియుత వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి అక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. అయితే ఇది తుపానుకు ముందు ఉండే ప్రశాంతతా? లేక శాంతికి సంకేతమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లకు, పంజ్​షేర్ తిరుగుబాటుదారులకు మధ్య రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరు వర్గాల డిమాండ్లుకు చాలా వ్యత్యాసం ఉండటం వల్ల.. మరోసారి సమావేశం కావాలనే నిర్ణయానికి వచ్చారు. పంజ్​షేర్​ ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లకు తలొగ్గదని తిరుగుబాటుదారులు చెబుతుండగా.. ఈ ప్రదేశాన్ని తాము ఇప్పటికే చుట్టుముట్టామని తాలిబన్లు అంటున్నారు.

Guns fall silent for now in Panjshir as talks with Taliban begin
పంజ్​షేర్ లోయలో నిశ్శబ్దం- తుపాను ముందు ప్రశాంతతా?
author img

By

Published : Aug 28, 2021, 1:35 PM IST

భీకర దాడులతో తాలిబన్ల(Afhgan Taliban) వెన్నులో వణుకు పుట్టించిన పంజ్​షేర్​ లోయ(Panjshir Valley) ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. మొన్నటి వరకు గర్జించిన అక్కడి తుపాకులు ఇప్పుడు మూగబోయాయి. శుక్రవారం నుంచి పంజ్​షేర్​లో ఒక్క తూటా కూడా పేలలేదు. అఫ్గాన్​ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లతో నార్తర్న్​ అలయన్స్ చర్చలు జరుపుతుండటమే ఇందుకు కారణం. పంజ్​షేర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పర్వాన్​ ప్రావిన్సు రాజధాని చారీకార్​లో తాలిబన్లకు, నార్తర్న్ అలయెన్స్​కు మధ్య రెండు రోజుల పాటు(బుధవారం, గురువారం) చర్చలు జరిగాయి.

ఈ భేటీలో మూడు గంటల పాటు చర్చించిన విషయాలను ఇరువర్గాల ప్రతినిధులు తమ అధినాయకత్వానికి తెలియజేశారు. అనంతరం అఫ్గాన్​లో(Afghan Crisis) శాంతి నెలకొల్పే దిశగా మరోసారి చర్చలు జరపనున్నారు. అప్పటి వరకు తాలిబన్లు(Taliban News), నార్తర్న్​ అలయెన్స్ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవద్దని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు నార్తర్న్ అలయన్స్ ప్రతినిధి మహమ్మద్​ ఆలం ఇజెద్యార్ టోలో న్యూస్​కు తెలిపారు. పంజ్​షేర్​లో తాలిబన్లపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన అహ్మద్ మసూద్(Panjshir Valley Massoud)ఈ భేటీకి హాజరుకాలేదు.

కాల్పుల విరమణ

చారీకార్​లో జరిగిన ఈ భేటీలో అఫ్గాన్​ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా పాల్గొన్నట్లు మహ్మద్​ ఆలం సన్నిహితుడు ఫహీం దాష్తీ తెలిపారు. కాల్పుల విరమణ మినహా ఈ సమావేశంలో మరే విషయంపై కచ్చితమైన ఏకాభిప్రాయానికి రాలేదని పేర్కొన్నారు. ఇది ముందుగానే ఊహించామన్నారు. అయితే ఈ చర్చల అజెండాపై మాత్రం స్పష్టత వచ్చిందన్నారు.

'ఈ సమావేశంలో పంజ్​షేర్ భవిష్యత్తుపై చర్చించాలని తాలిబన్లు కోరారు. మసూద్ తరఫు ప్రతినిధులు మాత్రం అఫ్గాన్​ భవిష్యత్​ ప్రభుత్వం నిర్మాణం గురించి మాట్లాడాలని పట్టుబట్టారు. వచ్చే ప్రభుత్వం ఐక్యతా విధానాన్ని పాటించడమే గాక మహిళలకు, మైనారిటీలకు సమాన హక్కులు కల్పించాలని పంజ్​షేర్ ప్రతినిధులు తేల్చి చెప్పారు' అని మహ్మద్ ఆలం టోలో న్యూస్​కు వివరించారు.

అఫ్గాన్​లో భవిష్యత్ ప్రభుత్వ పరిపాలనా విధాన నిర్మాణంపైనే మసూద్ ప్రతినిధులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే రెండు వర్గాల డిమాండ్లకు చాలా వ్యత్యాసం ఉందని సమాచారం. అఫ్గాన్​లో అధికారం పంచుకోవాలని మసూద్​ ప్రతినిధులు డిమాండ్ చేయగా.. పంజ్​షేర్ హోదా విషయంపై తాలిబన్లు పట్టుబట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందేశాన్ని ఇరు వర్గాలు తమ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాయని పేర్కొన్నాయి.

ఈ చర్చల పురోగతి కోసం తాము ఎదురు చూస్తున్నట్లు అహ్మద్​ మసూద్ మీడియాకు తెలిపారు. తాము మాత్రం పూర్తి సైనిక సన్నద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేశారు. పంజ్​షేర్ లోయను ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లకు సరెండర్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కానీ చర్చలకు మాత్రం సిద్ధమని స్పష్టం చేశారు.

పంజ్​షేర్​ను చుట్టుముట్టాం..

అయితే తాలిబన్ల(Afghanistan Taliban) వాదన మాత్రం మరోలా ఉంది. పంజ్​షేర్​ లోయను తాము ఇప్పటికే చుట్టుముట్టామని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. శత్రువు తమ గుప్పిట్లోనే ఉన్నారని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నాడు.

హజరా నాయకుడు, పీపుల్స్ ఇస్లామిక్ యూనిటీ పార్టీ ఛైర్మన్​ మహమ్మద్​ మోహఖిక్​ కూడా తమ మద్దతు మసూద్​కు ఉంటుందని ప్రకటించారు. ఇరానీలు, సంప్రదాయ తెగలతో ఈయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇదీ చూడండి: US Airstrike: అమెరికా ప్రతీకారం- ఐసిస్ స్థావరాలపై డ్రోన్​ దాడులు!

కాబుల్​లో గుబుల్​​.. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.