ETV Bharat / international

'ఆ నివేదిక శుద్ధ తప్పు.. అమెరికాతోనే పెద్ద ముప్పు' - అమెరికా రక్షణ శాఖ

చైనా తన అణ్వాయుధ సంపత్తిని ఊహించినదానికంటే వేగంగా పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ(Pentagon Report On China 2021) రూపొందించిన ఓ నివేదికను చైనా ఖండించింది. ప్రపంచంలో అణు ముప్పునకు అమెరికానే అతిపెద్ద మూలం అని ఆరోపించింది.

china nuclear weapons
చైనా అణ్వాయుధాలు
author img

By

Published : Nov 5, 2021, 5:16 AM IST

ఊహించినదానికంటే వేగంగా ప్రస్తుతం చైనా తన అణ్వాయుధ సంపత్తిని(China Nuclear Weapons) పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ(Pentagon Report On China 2021) తాజాగా ఓ నివేదికలో పేర్కొంది. అయితే దీన్ని డ్రాగన్‌ తీవ్రంగా ఖండించింది. పూర్తి పక్షపాత ధోరణితో నివేదికను(Pentagon Report On China 2021) రూపొందించినట్లు తిప్పికొట్టింది. పైగా ఈ వ్యవహారాన్ని పెద్దదిగా చేసి చూపెడుతోందని చైనా ఆరోపించింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఈ మేరకు స్పందించారు.

"గతంలోనూ అమెరికా విడుదల చేసిన ఆయా నివేదికల(Pentagon Report On China 2021) మాదిరిగానే ఇది కూడా వాస్తవాలను విస్మరించింది. చైనా అణు ముప్పు గురించి ప్రచారం చేసేందుకు ఈ నివేదికను ఉపయోగించుకుంటోంది. ప్రపంచంలో అణు ముప్పునకు అమెరికానే అతిపెద్ద మూలం."

-వాంగ్​ వెన్​బిన్​, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

చైనా వద్ద అణు వార్‌హెడ్‌ల సంఖ్య 2027 నాటికి 700కు చేరుకుంటుందని అమెరికా రక్షణ శాఖ నివేదిక(Pentagon Report On China 2021) అంచనా వేసింది. 2030 కల్లా ఆ సంఖ్య వెయ్యి దాటే అవకాశముందని పేర్కొంది. అగ్రరాజ్యం గతేడాది అంచనా వేసినదానికంటే రెండున్నర రెట్లు అధికం ఇది. చైనా వద్ద ఇప్పుడు ఎన్ని అణు వార్‌హెడ్‌లు ఉన్నాయన్నది మాత్రం తెలియజేయలేదు. గత ఏడాది లెక్కల ప్రకారం డ్రాగన్‌ వద్ద 200కు పైగా ఉన్నాయి. అమెరికాను తలదన్నే ప్రబల శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఆ దేశం తన అమ్ములపొదిలో భారీగా అణ్వస్త్రాలను చేర్చుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.