పాకిస్థాన్ స్వాట్ జిల్లా సమీపంలోని కొండ ప్రాంతంలో 1300 ఏళ్ల క్రితం నాటి హిందూ దేవాలయం బయటపడింది. బరీకోట్ గుండాయ్లో... పాకిస్థాన్, ఇటలీ పురావస్తు శాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం వెలుగుచూసింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా పురావస్తు శాఖ విభాగానికి చెందిన ఫజ్లే ఖాలిక్ ... తవ్వకాల్లో బయటపడింది విష్ణు దేవాలయం అని స్పష్టం చేశారు. ఈ ఆలయాన్ని హిందూ షాహి పరిపాలనా కాలంలో నిర్మించినట్లు పేర్కొన్నారు. స్వాట్ జిల్లా పురాతన కట్టడాలకు నిలయమని ఈ సందర్భంగా తెలిపారు.
ఇంకా ఎన్నో..!
తవ్వకాల్లో బయటపడ్డ ఆలయ ప్రాంతంలో ఓ స్నానపు గది, వాచ్ టవర్ ఉన్నట్లు గుర్తించామని పురావస్తు శాఖ నిపుణులు తెలిపారు.
" పాక్‌లోని స్వాట్ జిల్లా... పురతాన కట్టడాలకు, ప్రకృతి అందాలకు ప్రతీతి. దేశంలోని 20 ముఖ్య పర్యటక ప్రాంతాల్లో స్వాట్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది ".
- డా. లూకా, ఇటాలియన్ ఆర్కియాలజీ మిషన్ అధ్యక్షుడు.
ఇదీ చదవండి:బుకర్ ప్రైజ్- 2020 విజేత 'షగ్గీ బైన్'