ETV Bharat / international

Afghanistan Taliban:'తాలిబన్లను నడిపిస్తోంది పాకిస్థానే' - అఫ్గాన్ భారత్​ మైత్రి

అఫ్గాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) దురాక్రమణకు పాకిస్థానే కారణమని ఆరోపించారు అఫ్గాన్​కు చెందిన పాప్​ సింగర్​ అర్యాన సయూద్​(Afghanistan Pop Star Aryana Sayeed). తాలిబన్లకు నిధులు సమకూర్చటం సహా శిక్షణ కూడా పాకిస్థాన్ అందిస్తోందని చెప్పారు. అఫ్గాన్​కు భారత్​ నిజమైన మిత్రదేశం అని పేర్కొన్నారు.

Afghan pop star Aryana Sayeed
అర్యాన సయూద్
author img

By

Published : Aug 24, 2021, 11:25 AM IST

అఫ్గానిస్థాన్‌ సంక్షోభానికి పాకిస్థానే కారణమని అఫ్గాన్​కు చెందిన పాప్‌ సింగర్‌ అర్యాన సయీద్‌(Afghanistan Pop Star Aryana Sayeed) ఆరోపించారు. తాలిబన్లను(Afghanistan Taliban) పాకిస్థానే నడిపిస్తోందన్నారు. తాలిబన్‌ మూలాలు పాకిస్థాన్‌లో ఉండటమే కాకుండా.. వారికి నిధులు సమకూర్చటం సహా శిక్షణ ఇస్తోంది కూడా ఆ దేశమే అని ఆమె తెలిపారు. ఇటీవల తాలిబన్లు కాబుల్​ను ఆక్రమించిన తర్వాత అర్యానా.. అఫ్గాన్​ను వీడి వెళ్లారు.

  • #WATCH | "...I blame Pakistan. Over the yrs, we've seen videos & evidence that Pak is behind empowering Taliban. Every time our govt would catch a Talib, they'd see identification & it'd be a Pakistani, it's very obvious that it's them," says Afghan pop star Aryana Sayeed to ANI pic.twitter.com/eIBAGXvaCP

    — ANI (@ANI) August 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు పాకిస్థానే కారణం. తాలిబన్లకు నిధులు పాకిస్థాన్‌ అందించిన విషయం అందరికీ తెలిసిందే. వారికి పాకిస్థాన్‌ నుంచే సూచనలు అందుతాయి. వారి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. అక్కడే వారు శిక్షణ పొందుతారు. కొన్నేళ్ల నుంచి తాలిబన్లకు పాకిస్థాన్‌ మద్దతు ఉందని చెప్పగలను. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సాక్ష్యాలెన్నే లభించాయి. ఇప్పటికైనా అఫ్గాన్‌ రాజకీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ తలదూర్చవద్దని కోరుతున్నాను."

-అర్యాన సయీద్‌, అఫ్గానిస్థాన్‌ పాప్‌ సింగర్‌

అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్‌కు నిధులు నిలిపివేస్తే తాలిబన్లకు సాయం అందదని అర్యానా పేర్కొన్నారు. అఫ్గాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కష్టకాలంలో కాబుల్‌కు అండగా నిలుస్తున్న భారత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పొరుగుదేశాల్లో భారతే తమకు నిజమైన మిత్రదేశం అని చెప్పారు.

"భారత్​ మాకు ఎల్లప్పుడు శ్రేయస్కరంగా ఉంటుంది. భారత్​ మాకు మంచి మిత్ర దేశం. అఫ్గాన్ ప్రజల కోసం భారత్​ ఎంతో సాయం చేసింది. అఫ్గాన్ శరణార్థుల విషయంలోనూ భారత్​ అండగా నిలిచింది. అఫ్గానిస్థాన్​ తరఫున భారత్​కు కృతజ్ఞతలు"

-అర్యానా సయీద్​, అఫ్గాన్​ పాప్​ సింగర్​.

మహిళలు పాటల పాడకూడదని తాలిబన్లు ఒకప్పుడు విధించిన నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ.. 2015లో అర్యానా వేదికపై ప్రదర్శననిచ్చారు.

ఇదీ చూడండి: America Afghanistan: 'ఆగస్టు 31 నాటికి మా వాళ్లను తరలిస్తాం'

ఇదీ చూడండి: Afghanistan Taliban: తాలిబన్లపై ఎగిరిన తిరుగుబాటు జెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.