పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఏకంగా.. కరాచీలోని పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ పై నలుగురు ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది, ఒక ఎస్సై, స్థానిక పౌరుడు సహా మొత్తం 11మంది ప్రాణాలు కోల్పోయారు.
మొదట స్టాక్ ఎక్స్చేంజ్ భవనం ప్రధాన ద్వారం వద్ద గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు..తర్వాత భవనంలోకి చొచ్చుకెళ్లి తుపాకీతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ముష్కరులతో పోరాడుతూనే స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోని సిబ్బందిని ఖాళీ చేయించాయి. బలగాల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్ర దాడితో స్టాక్ ఎక్స్చేంజ్‌లోని సిబ్బంది.. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ దాడిలో మరికొంతమందికి గాయాలయ్యాయి.
ఇదీ చూడండి:టోల్గేట్ వద్ద మాజీ ఎంపీ వీరంగం.. పోలీసులపై దాడి!