ETV Bharat / international

కొత్త చిక్కు: లావెక్కుతున్న భారతం!

భారత్​లో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య 6 కోట్లకు తగ్గి జనాభాలో 14 శాతానికి చేరిందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) తెలిపింది. అయితే దేశంల ఊబకాయం బారినపడుతున్న వారి సంఖ్య పెరిగినట్లు ఓ నివేదికలో పేర్కొంది ఐరాస. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

author img

By

Published : Jul 14, 2020, 7:02 PM IST

132 million people could go hungry due to COVID-19, UN warns
పెరుగుతున్న ఊబకాయం.. తగ్గుతున్న పోషకాహార లోపం

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది మరింత మంది పస్తుల్లోకి జారుకునే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 'ఆహార భద్రత, పోషణ పరిస్థితి' నివేదికను ఆవిష్కరిస్తూ ఈ మేరకు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో దాదాపు 69 కోట్ల మందికి పైగా ప్రజలు ఆహార సమస్యలను ఎదుర్కొన్నారని... ఈ సంఖ్య 2018 ఏడాదితో పోలిస్తే కోటి పెరిగిందని నివేదికలో పేర్కొంది.

పెరుగుతున్న ఆకలి కేకలు

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదముందని అభిప్రాయపడింది. ఆఫ్రికాలో ఆకలి బాధలు వేగంగా విస్తరిస్తున్నాయన్న ఐరాస.. 2030 నాటికి ప్రపంచంలోని ఈ బాధితుల్లో ఆఫ్రికన్లే సగానికిపైగా ఉంటారని అంచనా వేసింది.

భారత్​లో ఇలా..

భారత్‌లో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు 2004-06 మధ్య కాలంలో 24.94 కోట్లు ఉండగా... 2017-19కి వచ్చే సరికి అది 18.92 కోట్లకు తగ్గినట్లు ఐరాస తెలిపింది. అయితే ఊబకాయం బాధితుల సంఖ్య పెరిగిందని నివేదికలో పేర్కొంది. మహిళల్లో రక్తహీనత పెరగగా... శిశుమరణాల రేటు ఎగబాకిందని వెల్లడించింది.

నివేదికలోని కీలకాంశాలు

  • 2012 సంవత్సరానికి గాను దేశంలోని ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 47.8 శాతం మంది పోషకాహారం లోపంతో బాధపడగా... 2019 నాటికి 34.7 శాతానికి తగ్గింది.
  • 2012లో 18ఏళ్లు దాటినవారిలో ఊబకాయంతో బాధపడుతున్నవారి సంఖ్య 2.52 కోట్ల నుంచి 2016 నాటికి 3.43 కోట్లకు పెరిగింది.
  • మహిళల్లో రక్తహీనత పెరిగి... పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. 2012లో 16.56 కోట్ల మంది రక్తహీనత బారినపడగా.. 2016నాటికి 17.56 కోట్లకు ఎగబాకింది.
  • శిశుమరణాల రేటుకు కూడా పెరిగింది. 2012లో 1.12 కోట్లు ఉండగా... 2016 నాటికి ఆ సంఖ్య 1.39 కోట్లకు చేరింది.

ఇదీ చూడండి: ఆ దేశంలో శీతాకాలం మళ్లీ కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.