ETV Bharat / international

'అక్టోబర్​లో అమెరికా టీకా రావడం కష్టమే'

అక్టోబర్‌ చివరికల్లా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావటం కష్టమేనని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడిలో నిపుణుల మార్గదర్శకాలను సరిగా పాటించకపోతే... దాని ప్రభావం మరి కొన్నాళ్ల పాటు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

vaccine
అమెరికా టీకా
author img

By

Published : Sep 4, 2020, 1:00 PM IST

అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని అమెరికా భావిస్తున్న తరుణంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌ చివరికల్లా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావటం కష్టమేనని అభిప్రాయపడ్డారు.

"నవంబర్​, డిసెంబర్​కు బదులుగా.. అక్టోబర్​లో వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకురావటం అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే కరోనా కట్టడిలో నిపుణుల మార్గదర్శకాలను సరిగా పాటించకపోతే... దాని ప్రభావం మరి కొన్నాళ్ల పాటు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాక్సిన్​ భద్రత, సామర్థ్యంపై శాస్త్రీయ ఆధారాలు లేనిదే వినియోగానికి ఆమోదం లభించకూడదు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన ఏడాది లోపు ప్రపంచం సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని నా అంచనా."

- ఆంటోని ఫౌచి, అమెరికా అంటువ్యాధుల నిపుణులు

2021 ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశముందని ఆయన ఇదివరకే వెల్లడించారు ఫౌచి.

అమెరికాలో నవంబర్‌ 1 కల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు పంపిణీ చేసేందుకు సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లను ఆదేశించింది. అయితే, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విమర్శల వెల్లువ..

ట్రంప్ రాజకీయ ఒత్తిళ్లతో వ్యాధి నియంత్రణ కేంద్రాలు (సీడీసీ), ఎఫ్​డీఏ వ్యాక్సిన్​పై చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటోందని వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

"వ్యాక్సిన్​ భద్రత సమాచారంపై అందరికీ నమ్మకం కలగాలి. కానీ, ఇప్పుడు ఏం జరుగుతుందోనని నాకు ఆందోళనగా ఉంది. ఎన్నికలకు ముందుగా వ్యాక్సిన్​ను ఆమోదించాలని ఎఫ్​డీఏపై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చాలా ఆధారాలు ఉన్నాయి. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా గెలిచేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజారోగ్యం విషయంలో నిర్ణయాలకు రాజకీయాలు పనికిరావు."

- చుక్​ షూమర్​, డెమొక్రటిక్ సెనేటర్​

మరోవైపు.. ప్రజారోగ్యంపై విపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​పై విశ్వాసాన్ని అణదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.

ప్రజల భద్రత విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి రాజీపడదని శ్వేతసౌధ మీడియా ప్రతినిధి కేలీ మెక్​ఎనానీ కూడా స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అధ్యక్ష ఎన్నికలకు ముందే అమెరికా వ్యాక్సిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.