తూర్పు లద్ధాఖ్లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగి భారీగా ప్రాణ నష్టం జరిగిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది అగ్రరాజ్యం అమెరికా. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి.
" 20 మంది సైనికులను కోల్పోయినట్లు భారత సైన్యం ప్రకటించింది. వారి కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఉద్రిక్తతలను తగ్గించేందుకే ఇరు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకు మేము మద్దతిస్తాం. జూన్ 2న అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో భారత్-చైనా సరిహద్దు అంశంపై చర్చించారు."
- అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి.