ETV Bharat / international

తేనెటీగల కోసం 'కందిరీగ'లపై అమెరికా యుద్ధం - 'కందిరీగల'పై అమెరికా ప్రతీకారం

సాధారణంగా పంటలు బాగా పండాలంటే పరాగ సంపర్కం చాలా అవసరం. ఇందుకు తేనెటీగలు బాగా సహాయపడతాయి. అయితే వాటి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి ఆసియాకు చెందిన విష కందిరీగలు. అందుకే వాటిని మట్టుబెట్టేందుకు ఏడాదిగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. రేడియో ట్రాకర్ల సాయంతో తాజాగా వాటి జాడ కనిపెట్టారు. అసలు విష కందిరీగలు ఏంటి? అవి ఏం చేస్తాయి? వాటిని ఎందుకు చంపాలని శాస్త్రవేత్తలు తిరుగుతున్నారు?

murder honet
స్వదేశీ తేనెటీగల కోసం 'కందిరీగల'పై అమెరికా ప్రతీకారం
author img

By

Published : Oct 24, 2020, 4:22 PM IST

వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వాయు కాలుష్యం, అధికంగా రసాయన ఎరువుల వాడకం వల్ల కీటకాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో పంటల ఉత్పత్తిలో మనిషికి ఎంతగానే ఉపయోగపడే తుమ్మెదలు, తేనెటీగల సంఖ్యా క్రమంగా తగ్గుతోంది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే సమస్య ఎదుర్కొంటోంది. అందుకే తాజాగా వాషింగ్టన్​ శాస్త్రవేత్తలు.. స్వదేశీ తేనెటీగలను రక్షించేందుకు నడుం బిగించారు. వాటికి శత్రువులుగా మారి ప్రాణాలు తీస్తున్న విష కందిరీగల భరతం పడుతున్నారు.

murder hornet
ఆసియా కందిరీగ

తొలి స్థావరం గుర్తింపు...

సాధారణంగా పంటలు బాగా పండాలంటే పరాగ సంపర్కం చాలా కీలకం. ఇందుకు తేనెటీగలు బాగా సహాయపడతాయి. అయితే వాటి జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తూ.. తమ పాలిట యముడిలా తయారయ్యాయి ఆసియా కందిరీగలు. విషం చిమ్మే సామర్థ్యం ఉన్న ఈ కీటకాల జాడ తెలుసుకునేందుకు చాలా నెలలు కష్టపడ్డారు వాషింగ్టన్​ శాస్త్రవేత్తలు. ఎట్టకేలకు ప్రత్యేకమైన ట్రాకింగ్​ డివైజ్​ల సాయంతో బ్లెయిన్​ అనే నగరంలో వాటి నివాసాలను గుర్తించారు. అనంతరం వాటి స్థావరాలను ధ్వంసం చేసి.. వాటిని పట్టుకున్నారు.

murder hornet
ట్రాకింగ్​ పరికరాలు అమర్చుతూ

బాస్కెట్​బాల్​ పరిమాణంలో ఉండే గూడులో దాదాపు 100 నుంచి 200 కందిరీగలు నివాసం ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సగటున 62 మంది మృతి..

బ్లెయిన్​ ప్రాంతంలో గత ఏడాదిగా తేనెటీగల పెంపకానికి, పంటలకు ఈ కందిరీగలు తీవ్రనష్టాలు చేకూరుస్తున్నాయి. రెండు అంగుళాల పొడవు ఉండే ఇవి తేనెటీగలను అమాంతం వేటాడేస్తాయి. ఈ కందిరీగల చిన్న గుంపు.. గంటల వ్యవధిలోనే మొత్తం తేనెతుట్టెలోని ఈగలన్నింటినీ ఖతం చేసేయగలవు.

murder hornet
కందిరీగ, తేనెటీగల పరిమాణం

ఇప్పటికే పంటలపై మందుల పిచికారీ, ఆహారం లేక తేనెటీగల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. ఇక ఈ ఆసియా జెయింట్స్​ వల్ల స్వదేశీ తేనెటీగల జీవనమే అస్తవ్యస్తమైంది. కందిరీగలను అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఆసియాకు చెందిన ఈ కీటకాలు ఉత్తర అమెరికాలోకి ఎలా వచ్చాయనేదానిపైనా పరిశోధనలు చేస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కీటకాల్లో ఒకటైన ఈ ఆసియా కందిరీగల వల్ల ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలోనూ సగటున 62 మంది మృతి చెందుతున్నట్లు సీడీసీ(సెంటర్స్​ ఫర్​ డిసీజెస్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​) స్పష్టం చేసింది.

2019 డిసెంబర్​లో తొలిసారి ఆసియా కందిరీగలను అమెరికాలో గుర్తించారు. ఇవి చైనా, జపాన్​, థాయ్​లాండ్​, దక్షిణ కొరియా, వియత్నాం సహా పలు ఆసియా దేశాల్లో కనిపిస్తాయి. ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్​ రాష్ట్రం, బ్రిటీష్​ కొలంబియాలో మాత్రమే వీటి జాడ కనిపిస్తోంది.

భారత్​లోనూ..

భూగోళంపై ఉన్న జీవజాలంలో సగానికిపైగా క్రిమికీటకాలే. ప్రపంచంలో మొత్తం 55 లక్షల కీటక జాతులు ఉంటే, వాటిలో 40 శాతం మరికొన్ని దశాబ్దాల్లో అంతరించిపోవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఒక్క భారత దేశంలోనే గడచిన 25 ఏళ్లలో 40 శాతం తేనెటీగలు అదృశ్యమయ్యాయని అధ్యయనాల్లో తేలింది.

మొక్కలు, కీటకాలు పరస్పర సహకారంతో పరిణామం చెందాయి. అయితే అడవులు క్రమంగా అంతరించిపోవడం కీటకాల పాలిట శాపమవుతోంది. తేనెటీగలు, తుమ్మెదల వంటి కీటక జాతులు లేనిదే మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగదు. ఈ కీటకాలు వ్యాపింపజేసే పుప్పొడి వల్లనే ప్రపంచంలోని 124 ప్రధాన పంటల్లో 75 శాతం, పూల మొక్కల్లో 94 శాతం మనుగడ సాగించగలుగుతున్నాయి.

భూమిపైనున్న 700 కోట్ల మానవ జనాభా మనుగడకు కీటకాలే శరణ్యం. పరపరాగ సంపర్కం లేనిదే మామిడి, నిమ్మ, నారింజ, ఆపిల్‌, బొప్పాయి, పుచ్చ వంటి పంటలు పండించడం కష్టం. ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, బెండకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్‌ వంటి కూరగాయలతోపాటు కొబ్బరి కాయలు, సెనగలు, బాదం, జీడిపప్పు, చాక్లెట్‌, కాఫీ వంటివి కూడా దొరకవు. వీటితోపాటు మసాలా దినుసులు, తేనె, లక్క, పట్టు, కొన్ని మందుల కోసం కూడా కీటకాలపై ఆధారపడుతున్నాం. పొద్దుతిరుగుడుతో పాటు పలు రకాల నూనెగింజలు సైతం పరపరాగ సంపర్క కీటకాల వల్లనే లభ్యమవుతున్నాయి.

కీటకాలను ఆహారంగా తీసుకునే మానవ తెగలు చాలానే ఉన్నాయి. 113 దేశాల్లోని మూడువేల జాతుల ప్రజలు 1,500 కీటక జాతులను భుజిస్తున్నారు. కీచురాళ్లు, గొల్లభామలు, చీమలు వీరికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.