ETV Bharat / international

పాక్​కు అమెరికా 6 మిలియన్​ డాలర్ల సాయం

పాకిస్థాన్​ కరోనాపై పోరాడేందుకు 6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది అమెరికా. ఈ మొత్తాన్ని ఆరోగ్య కార్యకర్తల శిక్షణ, సదుపాయాల కోసం పాక్ ప్రభుత్వం వినియోగించనుంది.

US to provide USD 6 million to Pakistan to fight coronavirus
పాకిస్థాన్​కు అమెరికా 6 మిలియన్​ డాలర్ల సాయం
author img

By

Published : May 25, 2020, 1:06 PM IST

కరోనాపై పోరు కోసం పాకిస్థాన్​కు 6 మిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ మెరుగుపరిచేందుకు, వైరస్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మొబైల్ ల్యాబ్​లను ఏర్పాటు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయని పాక్​కు అమెరికా రాయబారి పాల్ జోన్స్ తెలిపారు. ఫలితంగా కొవిడ్ ప్రభావం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈద్ పండుగ సందర్భంగా పాకిస్థానీలకు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికాకు ఇటీవల ఔషధాలు సరఫరా చేసినందుకు పాక్​కు కృతజ్ఞతలు చెప్పారు జోన్స్. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు ఇది నిదర్శనమన్నారు.

పాక్​లో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంతో తమ వంతు సాయంగా మొత్తం 21 మిలియన్​ డాలర్లు ఆర్థిక సాయంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.