UN climate resolution: వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్లకు సంబంధించి ఐరాస భద్రత మండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ తీర్మానంలోని అంశాలు సభ్య దేశాల మధ్య అసమ్మతి బీజాలు నాటేలా ఉన్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి సోమవారం పేర్కొన్నారు.
Russia vetoes UNSC climate
'వాతావరణ సంబంధ భద్రత ముప్పు'ను కేంద్రంగా భావించి, వ్యూహాలను సిద్ధం చేయాలన్న సారాంశంతో... ఐర్లండ్, నైగర్‌లు ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, తన వీటో అధికారాన్ని ఉపయోగించి రష్యా దీన్ని అడ్డుకొంది. భారత్ సైతం దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది.
India against UN climate resolution
"వాతావరణ పరిరక్షణకు సంబంధించిన వాస్తవ కార్యాచరణకు మా మద్దతుంటుంది. ఆఫ్రికా సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల తరఫున మేం మాట్లాడతాం. అయితే, దీనికి సరైన వేదిక యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ). అక్కడ మా కృషి కొనసాగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రూపొందించిన ఈ తీర్మానం... వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య పోరాటానికి విఘాతం కలిగించేలా ఉంది" అని భారత్ పేర్కొంది.
ఇదీ చదవండి: