అమెరికాలో జాత్యహంకార దాడులపై ఆందోళనలు పెరుగుతున్న వేళ దేశంలో స్మారక చిహ్నాలు, విగ్రహాలను రక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ మేరకు ఉద్దేశపూర్వకంగా విగ్రహాలు ధ్వంసం చేసే వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలకు 10 ఏళ్ల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ మృతికి నిరసనగా పెల్లుబికిన ఆందోళనల సందర్భంగా అమెరికాలోని అనేక చోట్ల ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేశారు. శ్వేత సౌధం సమీపంలోని లాఫాయిడ్ పార్కులో మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ విగ్రహాన్ని పగలగొట్టేందుకు సైతం ప్రయత్నించారు.
నిరసనకారుల ఆందోళనలపై ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్ జాతీయ సంపదను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నం, ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేసే వ్యక్తులను ఫెడరల్ చట్టం ప్రకారం శిక్షార్హులను చేస్తూ.. ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
-
I just had the privilege of signing a very strong Executive Order protecting American Monuments, Memorials, and Statues - and combatting recent Criminal Violence. Long prison terms for these lawless acts against our Great Country!
— Donald J. Trump (@realDonaldTrump) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I just had the privilege of signing a very strong Executive Order protecting American Monuments, Memorials, and Statues - and combatting recent Criminal Violence. Long prison terms for these lawless acts against our Great Country!
— Donald J. Trump (@realDonaldTrump) June 26, 2020I just had the privilege of signing a very strong Executive Order protecting American Monuments, Memorials, and Statues - and combatting recent Criminal Violence. Long prison terms for these lawless acts against our Great Country!
— Donald J. Trump (@realDonaldTrump) June 26, 2020
ఇదీ చూడండి: 'కొలంబస్'కు నిరసన సెగ- విగ్రహం ధ్వంసం