అధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖి సంవాదంలో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై.. డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ మండిపడ్డారు. ఆయన తీరు అధ్యక్ష హోదాకు అప్రతిష్ఠ కలిగించేలా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. "గత నాలుగేళ్లలో చేసిన విధంగానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి హోదాను మరోసారి తగ్గించారు" అని ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కమల. అదే సమయంలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. అమెరికా ప్రజలే తనకు ముఖ్యమని బైడెన్ స్పష్టం చేశారని అన్నారు.
"అభ్యర్థుల మధ్య బేధాలను తెలుసుకునే సామర్థ్యం అమెరికా ప్రజలకు ఉంది. ఈ రాత్రి(డిబేట్ జరిగిన రోజు) తేడా స్పష్టంగా తెలిసింది. ఓవైపు జో బైడెన్.. కెమెరాలను నేరుగా చూస్తూ అమెరికా ప్రజలతో సంభాషించారు. వేదికపై ఉన్నప్పుడు ప్రజలే ముఖ్యమని భావించారు. అమెరికాలోని కుటుంబాలే ప్రధానమనుకున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్.. గత నాలుగేళ్లలో చేసిన విధంగానే అమెరికా అధ్యక్ష పదవి హోదాను ఆయన మరోసారి తగ్గించారు."
-కమలా హారిస్, డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి
అంతకుముందు.. ట్విట్టర్ వేదికగా ట్రంప్‌పై విమర్శలు కురిపించారు కమల. నాలుగేళ్ల పాలలో దేశంలో జాతి విద్వేషాలకు ఆజ్యం పోశారని ట్రంప్‌పై ధ్వజెమెత్తారు. ఆయనను గద్దెదించడం మాత్రమే సరిపోదని.. దేశంలో వర్ణ వివక్షను సమూలంగా రూపుమాపేందుకు తమ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని తెలిపారు.
-
Tonight, America was presented with a choice: a leader who offers a clear path forward vs. an angry, interrupting bully. pic.twitter.com/2jDrnZLarF
— Kamala Harris (@KamalaHarris) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tonight, America was presented with a choice: a leader who offers a clear path forward vs. an angry, interrupting bully. pic.twitter.com/2jDrnZLarF
— Kamala Harris (@KamalaHarris) September 30, 2020Tonight, America was presented with a choice: a leader who offers a clear path forward vs. an angry, interrupting bully. pic.twitter.com/2jDrnZLarF
— Kamala Harris (@KamalaHarris) September 30, 2020
"అమెరికా ప్రజల ముందు రెండు ఎంపికలు ఉన్నాయి. ముందుకు నడిపించేందుకు స్పష్టమైన మార్గం చూపిన నాయకుడు. మరొకరు అంతరాయం కలిగించే కోపిష్టి వ్యక్తి."
-కమలా హారిస్ ట్వీట్
నాయకత్వం అంటే ఏంటనే విషయాన్ని అమెరికా ప్రజలకు బైడెన్ చూపించారని.. కమలా హారిస్ ప్రతినిధి సబ్రినా సింగ్ పేర్కొన్నారు. దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రజలందరినీ ఏకం చేయడమే మార్గమని ఆమె అన్నారు.
ఇదీ చూడండి- ట్రంప్ X బైడెన్: వాడీవేడిగా తొలి డిబేట్