క్యూబాను మళ్లీ తీవ్రవాద పోషక దేశాల జాబితాలో అమెరికా చేర్చింది. అమెరికాలో నేరాలకు పాల్పడిన వారికి ఆశ్రయం కల్పించడం, వెనెజువెలా నేత నికోలస్ మదురోకు మద్దతివ్వడం, క్యూబన్లను అణచివేయడం.. వంటి చర్యలకు పాల్పడుతున్నందువల్ల దాన్ని తీవ్రవాద పోషక దేశాల జాబితాలో చేర్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది.
అంతర్జాతీయ తీవ్రవాదానికి క్యూబా పదేపదే మద్దతిస్తోందని అమెరికా మండిపడింది. పొరుగుదేశంతో సత్సంబంధాల కోసం 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యూబాను తీవ్రవాద పోషక జాబితా నుంచి తొలగించారు. అయితే ఆ తర్వాత వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను గద్దెదిగడానికి వారం రోజుల ముందు క్యూబాను మళ్లీ తీవ్రవాద పోషక జాబితాలో చేర్చారు. అదే విధానాన్ని ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వమూ కొనసాగించింది.
ఇదీ చూడండి: 'భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం'