ETV Bharat / international

'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

ఎండాకాలంలో భారత్​ కరోనా మహమ్మారిని జయించే అవకాశముందంటోంది అమెరికా. వేసవిలో.. వైరస్​ బలహీనపడుతుందని.. ఆ సమయంలో వైరస్​ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని అధికారిక అధ్యయనంలో తేలినట్లు పేర్కొంది. కొవిడ్​ను నాశనం చేయడంలో బ్లీచ్​ కంటే ఐసోప్రొపైల్​ ఆల్కహాల్ సమర్థంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది.​

Summer-like conditions can curb COVID-19 transmission: US official
'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'
author img

By

Published : Apr 24, 2020, 1:06 PM IST

Updated : Apr 24, 2020, 1:35 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను అణిచే శక్తి సూర్యుడికి ఉందంటోంది అమెరికా. వేసవిలో కొవిడ్​-19 బలహీనంగా మారుతుందని.. ఈ సమయంలో వైరస్​ను అంతం చేయడం సులభమంటోంది.

భారత్​కు మంచి ఛాన్స్​..

యూఎస్​ శాస్త్రీయ-సాంకేతిక సంచాలక కార్యాలయం తాజాగా ఓ పరిశోధన చేపట్టింది. వేసవిలో సూర్యుడి అతినీలలోహిత కిరణాలు, అధిక ఉష్ణోగ్రత, ఆర్ద్రత, వంటి పరిస్థితులు.. కరోనా వైరస్​ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ అధ్యయంలో తేలింది. భారత్​కు ఈ ఎండాకాలం వైరస్​ను జయించేందుకు దోహదపడుతుందని శ్వేతసౌధంలో, అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సమక్షంలో ప్రకటించింది ఆ దేశ హోం శాఖ.

"వేసవిలో కరోనా వ్యాప్తి తగ్గుతుంది. ప్రత్యక్ష సూర్యకాంతిలో వైరస్​ వేగంగా నశిస్తుంది.​ 35 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉంటే... ఉపరితలంపై ఉన్న వైరస్​ జీవితకాలం 18 గంటల నుంచి కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యక్షంగా సూర్యకాంతి తగిలితే కరోనా కొద్ది నిమిషాల్లోనే అంతమవుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి దిల్లీలో గరిష్ఠంగా 36.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. "

-బిల్ బ్రయాన్, హోంశాఖ సహాయ మంత్రి

బ్లీచ్​​ వర్సెస్​ ఐసోప్రొపైల్

కరోనాను నాశనం చేసే క్రిమి సంహారకాలనూ పరీక్షించింది అమెరికా. బ్లీచ్​​, ఐసోప్రొపైల్​ ఆల్కహాల్​లను లాలాజలం, శ్వాసకోశ ద్రవాల్లోని వైరస్​పై పరీక్షించగా.. బ్లీచ్​ వైరస్​ను ఐదు నిమిషాల్లో నాశనం చేస్తోంది. కానీ, ఐసోప్రొపైల్​ మాత్రం కేవలం 30 సెకన్లలో కరోనాను అంతం చేస్తోందని తేలింది.

ఇదీ చదవండి:కరోనా సోకిందనే డౌట్​తో దాడి- యువకుడు మృతి

Last Updated : Apr 24, 2020, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.