ETV Bharat / international

మహిళల హత్య కేసులో నిందితుడికి 160 ఏళ్ల జైలు! - మహిళలను హత్య చేస్తున్న కిరాతకుడు

డేటింగ్​ యాప్స్​ ద్వారా వల వేసి ముగ్గురు మహిళలను పొట్టనపెట్టుకున్న దుండగుడికి(serial killer in america).. అపహరణ, హత్య సహా పలు నేరాల కింద 160 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదేళ్ల తర్వాత శిక్ష ఖరారు చేసింది. ఓ బాధితురాలి స్నేహితులు ఫేక్​ అకౌంట్లు రూపొందించి నిందితుడిని పట్టించటంపై ప్రశంసించింది కోర్టు. ఈ సంఘటన అమెరికా, న్యూజెర్సీలో జరిగింది.

Serial killer
'డేటింగ్​ యాప్స్​'తో వరుస హత్యలు
author img

By

Published : Oct 7, 2021, 9:58 AM IST

డేటింగ్​ యాప్స్​తో వలపన్ని ఐదేళ్ల క్రితం ముగ్గురు మహిళలను అత్యంత దారుణంగా హతమార్చిన కిరాతకుడికి(serial killer in america) 160 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ సంఘటన అమెరికా, న్యూ జెర్సీ రాష్ట్రంలో జరిగింది. మూడు హత్యలు, ఒక హత్యాయత్నం, అపహరణ, దారుణంగా దహనం చేయటం వంటి ఆరోపణలపై తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. నేరాలకు పాల్పడినప్పుడు నిందితుడి వయసు 20 ఏళ్లే కావటం గమనార్హం.

నెవార్క్​లోని అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీ తీర్పు చెప్పిన తర్వాత.. షాక్​కు గురై కొన్ని క్షణాలపాటు నిందితుడు ఖలీల్​ వీలర్-వీవర్​​(25) కదలకుండా కూర్చుండిపోయాడు(serial killer). తనకు ఈ సంఘటనలతో ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని జడ్జి మార్క్​ ఎస్​.అలీతో చెప్పాడు. వీలర్​ తల్లి, అత్తమ్మ, సోదరుడు కోర్టుకు హాజరైనా ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు.

ఫేక్​ అకౌంట్లతో..

నిందితుడిని(serial killer) పట్టించేందుకు.. బాధితురాలు సారా బట్లర్​ స్నేహితులు సామాజిక మాధ్యమాల్లో సొంతంగా డిటెక్టివ్​ పని మొదలు పెట్టి విజయం సాధించారు. ఫేక్​ అకౌంట్లు రూపొందించి.. వీలర్​ వీవర్​ తమ ఉచ్చులో పడేలా చేశారు. మోంట్​క్లేయర్​లో కలుద్దామని చెప్పి పోలీసులకు పట్టించారు. వారి పనిని ఎస్సెక్స్​ కౌటీ ప్రాసిక్యూటర్స్​ కార్యాలయం ప్రశంసించింది.

అలాగే.. తనపైనా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని నాలుగో బాధితురాలు కోర్టులో సాక్ష్యం చేప్పటం వల్ల వీలర్​కు కఠిన శిక్ష పడింది. 2016లో సెప్టెంబర్​-డిసెంబర్​ మధ్య వెస్ట్​, బట్లర్​ల మృతదేహాలు దొరికాయి. ఆయా ప్రాంతాల్లో దుండగుడి సెల్​ఫోన్​ సిగ్నల్స్​ లభ్యమైనట్లు ఆధారాలు సమర్పించారు పోలీసులు.

ఒకరి తర్వాత ఒకరిని..

ఈ తీర్పుకు ముందు బాధితులు రాబిన్​ వెస్ట్​(19), సారా బట్లర్​ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ వారికి జరిగిన అన్యాయంపై కోర్టులో మాట్లాడారు. ఫిలడెల్ఫియాకు చెందిన వెస్ట్​ 2016, ఆగస్టు 31న వీలర్​ కారు ఎక్కుతూ కనిపించింది. కొన్ని గంటల్లోనే హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని తన నివాసానికి సమీపంలోని పాడుబడిన ఓ ఇంటిలో పడేసి.. నిప్పంటించాడని అధికారులు తెలిపారు. ఆమెను గుర్తించేందుకు రెండు వారాలు పట్టినట్లు చెప్పారు. మరో బాధితురాలు నెవార్క్​కు చెందిన జోన్​ బ్రౌన్​(33)​.. వెస్ట్​ను గుర్తించిన నెల రోజుల తర్వాత హత్యకు గురైంది. ఆమెను సైతం ఓ పాడుబడిన ఇంట్లోనే ఆరువారాల తర్వాత గుర్తించారు. మరో బాధితురాలు సారా బట్లర్​ 2016లో థ్యాంక్స్​గివింగ్​ ముందు బ్రౌన్​ హత్య జరిగిన నెల తర్వాత కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వారందరిని దుస్తులతో గొంతు నులిమి హత్యచేసినట్లు తేలింది.

ఇదీ చూడండి: ఒళ్లు గగుర్పొడిచే కిల్లర్ కథ... 18 హత్యల వెనుక క్రైం కహానీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.