ETV Bharat / international

చైనాలో అమెరికా దౌత్యవేత్తలపై 'మైక్రోవేవ్' దాడి! - క్యూబా చైనా అమెరికా అధికారులు

2016-18 మధ్యకాలంలో క్యూబా, చైనా దేశాల్లో అనేక మంది అమెరికా దౌత్యవేత్తలు అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యారు. దీనిపై ఓ కమిటీ విచారణ చేపట్టింది. మైక్రోవేవ్​ రేడియేషన్లను వారిపై ప్రయోగించడం వల్లే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొంది.

Report finds microwave energy likely made US diplomats ill
చైనాలో అమెరికా దౌత్యవేత్తల అనారోగ్యానికి కారణమిదే!
author img

By

Published : Dec 6, 2020, 12:54 PM IST

క్యూబా, చైనాలోని తమ దేశ దౌత్యవేత్తలు అనూహ్యంగా అనారోగ్యానికి గురైన ఘటనలపై అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. మైక్రోవేవ్​ రేడియేషన్లకు వారు గురికావడమే అనారోగ్యానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువని నివేదిక పేర్కొంది. అయితే ఈ రేడియేషన్లను వారిపై ప్రయోగించారని ఆరోపించింది.

2016లో క్యూబా రాజధాని హవానాలో అనుమానాస్పద స్థితిలో ఓ అమెరికా సిబ్బంది అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత ఇదే తరహాలో 2017-18లో క్యూబాతో పాటు చైనాలోనూ అమెరికా, కెనడా దౌత్యవేత్తలు అస్వస్థతకు గురయ్యారు. వీరు తీవ్ర ఒత్తిడి, తల నొప్పి, మైకాన్ని అనుభవించారు. అదే సమయంలో తెలిసిన విషయాలను గుర్తుతెచ్చుకోవడం, కొత్తవాటిని అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందిపడ్డారు.

ఈ ఘటనలపై అమెరికాకు చెందిన 19 సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టింది.

"ఈ అంతుచిక్కని ఘటనల వెనుక కారణాలు తెలుసుకునే క్రమంలో మేము ఎన్నో సవాళ్లను ఎదర్కొన్నాము. బాధితుల్లో లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. మరోవైపు ఈ తరహా కేసులపై పరిశోధనలకు సంబంధించిన వివరాలు లేవు. పల్సడ్​ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని బాధితులపై ప్రయోగించారన్నదే.. ప్రశ్నకు అత్యంత దగ్గర సమాధానం అని భావిస్తున్నాం. అయితే ఈ తరహా ఘటనలు ఆందోళకరం. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలను అడ్డుకునేందుకు దృష్టి సారించాలి."

--- డేవిడ్​ రెల్మన్​, కమిటీ ఛైర్మన్​.

ఇదీ చూడండి:- తీవ్ర పేదరికంలోకి 20 కోట్ల మంది: ఐరాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.