ETV Bharat / international

ప్రపంచాన్ని చుట్టేస్తున్న 'ఒమిక్రాన్​'- మరిన్ని దేశాల్లో ఆంక్షలు - travel ban

omicron variant: ఒమిక్రాన్​.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్​ కొత్త రకం(omicron variant news). ఇప్పటికే భూమండలంలోని రెండువైపుల ఉన్న దేశాల్లో ఈ వేరియంట్​ కేసులు వెలుగు చూశాయి. రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు సరిహద్దులను మూసివేస్తున్నాయి.

omicron cases
'ఒమిక్రాన్
author img

By

Published : Nov 29, 2021, 11:08 AM IST

Updated : Nov 29, 2021, 12:35 PM IST

omicron variant: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు(omicron variant news) క్రమంగా పెరుగుతున్నాయి. భూమండలంలోని రెండువైపుల ఉన్న దేశాల్లో ఈ కేసులు కనిపించాయి. అయితే, గతంలోని రకాల కంటే ఎంత ప్రమాదకరమనేది ఇంకా తెలియదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు చాలా సమయం పడుతుందని చెబుతున్నప్పటికీ.. ముందస్తు చర్యలు చేపడుతున్నాయి చాలా దేశాలు. తమ సరిహద్దులను మూసివేస్తున్నాయి.

హాంగ్​కాంగ్​ నుంచి ఐరోపా, ఉత్తర అమెరికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్​ కేసులను(omicron variant latest news) గుర్తించారు. అలాగే నెదర్లాండ్స్​లో ఆదివారం ఒక్కరోజే 13 కేసులు బయటపడ్డాయి. మొత్తంగా 61 కేసులు వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు.. కెనడా, ఆస్ట్రేలియాలో రెండేసి కేసులు వెలుగు చూశాయి.

ఫ్రాన్స్​లో 8 ఒమిక్రాన్​ అనుమానిత కేసులు(omicron variant cases) వెలుగు చూశాయి. గత 14 రోజుల క్రితం ఆఫ్రికా పర్యటనకు వెళ్లి వచ్చిన వారిలో ఎనిమిది మందికి వైరస్​ పాజిటివ్​గా తెలిపినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. పొరుగు దేశాల్లో ఇప్పటికే కొత్త వేరియంట్​ కేసులు రావటం ఆందోళన కలిగిస్తున్నట్లు ఫ్రాన్స్ పేర్కొంది. ఈక్రమంలో ఆఫ్రికా దేశాల నుంచి విమానాలను నిలిపివేసింది.

ఇజ్రాయెల్​లోనూ కేసులు(omicron variant cases) నమోదైన క్రమంలో విదేశీయులపై ఆంక్షలు విధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలను రెండు వారాలాపాటు నిలిపివేసింది మొరాకో. సోమావారం నుంచి ఆంక్షలు అమలులోకి(travel ban) వస్తాయని స్పష్టం చేసింది. ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, ఇప్పటికే చాలా దేశాలకు పాకింది కొత్త వైరస్​. సరిహద్దులను మూసివేయటం(countries closed their borders) అంతగా ప్రభావం చూపదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

వైరస్​ అలిసిపోదు..

కరోనా జాగ్రత్తలు పాటించటం, మాస్కులు ధరించటం, భౌతిక దూరం, టీకాలు తీసుకోవటం వంటి విషయాలను వినీ వినీ అమెరికన్లు విసిగిపోయారని, అయితే, కరోనా వైరస్​ అలసిపోదని గుర్తు చేశారు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ డాక్టర్​ ఫ్రాన్సిస్​ కొలిన్స్​. రక్షణ కవచాలను మరవొద్దని హెచ్చరించారు.

" దక్షిణాఫ్రికాలోని చాలా జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ కేసులు నమోదైన క్రమంలో ఇది వేగంగా వ్యాపించే అంటువ్యాధిగా భావిస్తున్నా. ఒకరి నుంచి ఒకరికి వేగంగా అంటుకుంటోంది. అయితే, ఇది గతంలోని డెల్టా రకంతో పోటీ పడుతుందని అనుకోవట్లేదు. మాస్కులు ధరించటం, బూస్టర్​ డోసుల పంపిణీ వంటి ఇప్పటికే ఉన్న వాటిని వేగవంతం చేయాలి. అలాంటి విషయాలను వింటూ అమెరికన్లు అలసిపోయారని నాకు తెలుసు, కానీ, వైరస్​ అలసిపోదు. "

- డా.ఫ్రాన్సిస్​ కొలిన్స్​, యూఎస్​ జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​.

జపాన్​లో ఆంక్షలు..

విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను(travel ban) విధిస్తున్నట్లు జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. ఆఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సందర్శకుల రాకను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వదేశీ ప్రయాణికులపై 10 రోజుల క్వారంటైన్​తో పాటు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇప్పటికే విదేశీ పర్యటకులపై నిషేధం విధించింది.

మరో రెండు వారాలు..

దక్షిణాఫ్రికాతో పాటు ఆఫ్రికాలోని మరో ఏడు దేశాల నుంచి ప్రయాణాలను(countries closed their borders) నిషేధిస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. దీని ద్వారా ఒమిక్రాన్​ కట్టడి చర్యలు చేపట్టేందుకు సమయం దొరుకుతుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌసీ తెలిపారు. ఒమిక్రాన్​ వేరియంట్​ వ్యాప్తి, తీవ్రత వంటి ఇతర లక్షణాలపై ఓ అంచనాకు వచ్చేందుకు మరో రెండు వారాల సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న టీకాలు కొవిడ్​ తీవ్ర లక్షణాలపై ప్రభావం చూపుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే టీకా తీసుకున్నవారికి బూస్టర్​ డోసులు ఇవ్వటం ద్వారా మరింత రక్షణ లభిస్తుందన్నారు.

కొత్త వేరియంట్​పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకుండా ఎక్కువగా స్పందించటం అనర్థాలకు దారితీస్తుందన్న డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరికలను విస్మరిస్తూ చాలా దేశాలూ ఆంక్షలు విధిస్తున్నాయి.

ఆంక్షలపై దక్షిణాఫ్రికా అసహనం..

కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న క్రమంలో.. తమ దేశంలో లెవెల్​ వన్​ స్థాయిలోనే లాక్​డౌన్​ ఆంక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు దక్షిణాప్రికా అధ్యక్షుడు సిరిల్​ రామపోసా. తమ దేశంతో పాటు సమీప దేశాలపై 20కిపైగా దేశాలు విధించిన ప్రయాణ ఆంక్షలను వెంటనే తొలిగించాలని కోరారు. ఆఫ్రికా దేశాలు ఇప్పటికే వైరస్​ వల్ల తీవ్రంగా నష్టపోయాయని, కొత్త ఆంక్షలతో వాటి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: వెలుగుచూసిన మూడో ఒమిక్రాన్ కేసు.. ఫేస్​ మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Last Updated : Nov 29, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.