ETV Bharat / international

ఉష్ణ ప్రయోగంతో కరోనా పనిపట్టే మాస్కు! - మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాస్కు

అమెరికాలోని మసాచు సెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు ఓ వినూత్న మాస్కును అభివృద్ధి చేశారు. వైరస్​ను క్రియారహితంగా మార్చే మాస్కును ఆవిష్కరించారు. ఈ మాస్కు.. వైరస్​ను తనలో నుంచి వెళ్లనిచ్చి.. వాటిపై అధిక ఉష్ణోగ్రత ప్రయోగించి చంపేస్తుంది.

mits-new-face-mask-can-inactivate-novel-coronavirus-using-heat
ఉష్ణ ప్రయోగంతో కరోనా పనిపట్టే మాస్కు!
author img

By

Published : Oct 30, 2020, 8:16 AM IST

సాధారణంగా మాస్కుల పనేంటి? బాహ్య వాతావరణం నుంచి కరోనా వైరస్ వంటి సూక్ష్మజీవులు నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించకుండా వడగట్టడం. అంతేకదా..! అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు మాత్రం ఓ వినూత్న మాస్కును అభివృద్ధి చేశారు. అది సూక్ష్మజీవులను అడ్డుకోదు! తనలో నుంచి వెళ్లనిస్తుంది. అయితే- అలా వెళ్లే మార్గంలోనే వాటిపై అధిక ఉష్ణోగ్రతను ప్రయోగించి చంపేస్తుంది.

కొవిడ్ వంటి మహమ్మారుల వ్యాప్తిని నిరోధించడంలో ఈ ఆవిష్కరణ కీలకంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా మాస్కులో కాపర్​తో రూపొందించిన ఓ జాలీ ఉంటుంది. బ్యాటరీ సహాయంతో అది ఉష్ణ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. వ్యక్తులు శ్వాస తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు కరోనా సహా ఎలాంటి సూక్ష్మ జీవులనైనా సరే ఈ మాస్కు తన ద్వారావెళ్లనిస్తుంది. అలా వెళ్లే క్రమంలో వాటి వేగాన్ని మందగింపజేస్తుంది. జాలీ నుంచి నిరంతరాయంగా వెలువడే ఉష్ణ తరంగాలు వాటిని క్రియారహితంగా మార్చేస్తాయి.

మాస్కు నుంచి వెలువడే ఉష్ణ తరంగాలు వ్యక్తుల ఆరోగ్యంపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపబోవని.. ముక్కు లోపలికి ప్రవేశించే లోపు ఆ శ్వాస తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని పరిశోధకులు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.