ETV Bharat / international

అమెరికాకు వలసలు బంద్​.. ఉత్తర్వులపై ట్రంప్​ సంతకం - అమెరికాలో అన్ని రకాల వలసలు బంద్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశానికి అన్ని రకార వలసలను తాత్కాలికంగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. కరోనా సంక్షోభం ముసురుకున్న వేళ అమెరికన్ పౌరులకు ఉద్యోగ భద్రతను కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

trump just signed an executive order temporarily suspending immigration into the United States
అమెరికాకు వలసలు బంద్​.. ఉత్తర్వులపై ట్రంప్​ సంతకం
author img

By

Published : Apr 23, 2020, 5:11 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​... అన్ని రకాల వలసలను తాత్కాలికంగా రద్దు చేస్తూ కార్యానిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. కరోనా సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అమెరికన్ పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

60 రోజుల పాటు

వలసల తాత్కాలిక రద్దు అనేది 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని ట్రంప్​ స్పష్టంచేశారు. 60 రోజుల తర్వాత అప్పటి పరిస్థితిని అనుసరించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అమెరికా పౌరుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు ట్రంప్​.

డొనాల్డ్​ దెబ్బకు గ్రీన్ కార్డుల జారీ నిలిపివేయనున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా అమెరికాకు వెళ్లాలని ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు తీవ్ర నిరాశ మిగలనుంది.

ఇదీ చూడండి: కిమ్​ ఆరోగ్యంపై మౌనం వీడని ఉత్తర కొరియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.