ETV Bharat / international

ర్యాపిడ్ టెస్టులతో 6 వారాల్లోనే కరోనా ఖతం! - కరోనా పరీక్షలు కచ్చితత్వం సమయం

కరోనాను సమూలంగా రూపుమాపే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్కువ కచ్చితత్వంతో కరోనాను గుర్తించే ర్యాపిడ్ పరీక్షలే ఇందుకు ప్రధాన ఆయుధమని తెలిపారు. భారీ స్థాయిలో, తరచుగా ర్యాపిడ్ పరీక్షలను నిర్వహించడం ద్వారా వైరస్​ను పూర్తిగా నిర్మూలించవచ్చని అంచనా వేశారు.

Frequent, rapid testing can curb COVID-19 transmission within weeks: Study
ర్యాపిడ్ టెస్టులతో ఆరు వారాల్లోనే కరోనా ఖతం!
author img

By

Published : Nov 22, 2020, 5:24 PM IST

వారాల వ్యవధిలో సగం జనాభాకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడం ద్వారా కరోనాను సమూలంగా రూపుమాపవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ప్రామాణికమైన డయాగ్నోస్టిక్స్, పీసీఆర్ పరీక్షలతో పోలిస్తే తక్కువ ప్రభావవంతమైన ఈ టెస్టుల ద్వారా ఆరు వారాల్లోనే కరోనాను అంతమొందించవచ్చని తేలింది. కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఈ వ్యూహాన్ని పాటిస్తే లాక్​డౌన్ల అవసరం ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు 'సైన్స్​ అడ్వాన్సెస్' జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

కచ్చితత్వం x సమయం

కొవిడ్ నియంత్రణకు పరీక్షల కచ్చితత్వం ముఖ్యమా లేదా ఫలితం వచ్చే సమయం ప్రధానమా అనే విషయంపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా రోగి శరీరంలో ఇన్ఫెక్షన్ స్థాయిలలో మార్పులను గమనించారు. కరోనా సోకినప్పుడు, లక్షణాలు బయటపడ్డప్పుడు, వ్యాప్తికి కారణమైనప్పుడు బాధితులలో ఇన్ఫెక్షన్ స్థాయిలను అధ్యయనం చేశారు.

గణితశాస్త్ర విధానాలను అనుసరించి మూడు ఊహాజనితమైన పరిస్థితుల్లో పరీక్షల ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై పరిశోధన చేశారు. 10 వేల మంది ప్రజలు ఉండే ఓ ప్రాంతం, 20 వేల మంది ఉండే యూనివర్సిటీ, 84 లక్షల జనాభా ఉన్న నగరం.. ఈ మూడు పరిస్థితుల్లో పరీక్షల ప్రభావంపై మదింపు వేశారు. దీన్ని బట్టి కరోనా నియంత్రణకు కచ్చితత్వం కంటే పరీక్షల స్థాయి, సమయమే చాలా ముఖ్యమని తేల్చారు.

ఆరు వారాల్లోనే మాయం!

ఉదహరణకు.. ఒక పెద్ద నగరంలో తక్కువ కచ్చితత్వంతో కూడిన ర్యాపిడ్ టెస్టులను వారానికి రెండు సార్లు భారీ స్థాయిలో చేపట్టడం ద్వారా వైరస్ ఇన్ఫెక్షన్ 80 శాతం వరకు తగ్గించవచ్చని గుర్తించారు. అదే సమయంలో ప్రామాణిక పరీక్ష అయిన పీసీఆర్ ద్వారా వారానికి రెండు సార్లు టెస్టింగ్ నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి 58 శాతం మాత్రమే తగ్గుతుందని తెలిపారు.

అదే విధంగా.. ఒక నగరంలోని నాలుగు శాతం మంది ప్రజలకు కరోనా సోకితే, ఆ ప్రాంతంలో కరోనా నియంత్రణకు మూడు రోజులకు ఒకసారి ప్రతి నలుగురిలో ముగ్గురికి పరీక్షలు నిర్వహిస్తే కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదం 88 శాతం తగ్గుతుందని తెలిపారు. ఇలా చేస్తే ఆరు వారాల్లోనే కరోనాను నిర్మూలించవచ్చని అంచనా వేశారు.

సమయమే కీలకం

పీసీఆర్ ఫలితాలు రావడానికి 48 గంటలు సమయం పడుతోంది. అందువల్లే కరోనా నియంత్రణకు ర్యాపిడ్ టెస్టులు మేలని చెబుతున్నారు పరిశోధకులు. దాదాపు మూడింట రెండొంతుల కరోనా కేసుల్లో లక్షణాలు కనిపించడం లేదు. ఫలితాల కోసం వేచి చూసే సమయంలో వారి నుంచి ఇంకొందరికి కరోనా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధరణకు పాటిస్తున్న పరీక్ష విధానాల సామర్థ్యం, కచ్చితత్వం వేర్వేరుగా ఉన్నాయి. పీసీఆర్ పరీక్ష ద్వారా కరోనాను నిర్ధరించాలంటే మిల్లీ లీటర్ నమూనాలో 5 వేల నుంచి 10 వేల కాపీల వైరల్ జెనెటిక్ మూలాలు ఉండాలి. అయితే, పీసీఆర్ పరీక్షలతో పోలిస్తే యాంటీజెన్ పరీక్షలకు వెయ్యి రెట్లు, ఆర్​టీ-ల్యాంప్ పరీక్షకు 100 రెట్లు ఎక్కువగా వైరల్ లోడ్ ఉంటేనే కరోనా బయటపడుతుంది.

"ఎక్కువ కచ్చితత్వంతో రేపు ఫలితాలు రావడం కంటే తక్కువ కచ్చితత్వంతో ఈరోజు ఫలితాలు రావడమే చాలా ముఖ్యమని మా పరిశోధనలో గుర్తించాం. అందరినీ ఇంట్లో ఉండమని ఆదేశాలు జారీ చేసే బదులు వైరస్ సోకిన ఒక్క వ్యక్తిని గుర్తించడం ముఖ్యం. ఇలా చేస్తే బాధితులు మాత్రమే ఐసోలేషన్​లో ఉంటారు. మిగతా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి."

-డేనియల్ లారేమోర్, ప్రధాన పరిశోధకుడు

పరీక్షలను తరచుగా నిర్వహించడం వల్ల కరోనాను సమూలంగా నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాబట్టి పరీక్షల నిర్వహణ వ్యూహాన్ని మార్చాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి- 'కరోనా భయాలతోనే హజ్​కు తగ్గిన దరఖాస్తులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.