ETV Bharat / international

టెక్​ గురూ: ఇక హైటెక్​గా పళ్లు తోముకోండి

ఉరుకుల పరుగుల జీవనంలో దంత దావనం వంటి వ్యక్తిగత పరిశుభ్రతలో అశ్రద్ధ వహిస్తాం. సమగ్రంగా దంత దావనం చేసే అత్యాధునిక టూత్ బ్రష్​ను 'ఓరల్ బీ' సంస్థ రూపొందించింది. ఈ బ్రష్ ద్వారా నోటి ఆరోగ్యం, శుభ్రత ఏ మేర ఉంది. సరిగా బ్రష్ చేశామా? లేదా? అన్న విషయాన్ని వినియోగదారులు ఇట్టే తెలుసుకోవచ్చు.

Dental brand Oral-B is embracing artificial intelligence with its new toothbrush
టెక్​ గురూ: ఇక హైటెక్​గా పళ్లు తోముకోండి
author img

By

Published : Feb 27, 2020, 5:33 PM IST

Updated : Mar 2, 2020, 6:46 PM IST

టెక్​ గురూ: ఇక హైటెక్​గా పళ్లు తోముకోండి

ఇందు కలదు అందు లేదని సందేహమే అక్కర్లేదు. ఆధునిక సాంకేతికత ఉపయోగించని రంగమంటూ ఏదీ లేదు. ఉదాహరణకు మణికట్టుకు పెట్టుకున్న గడియారం మనం ఎన్ని అడుగులు, ఎంత వేగంతో నడిచామో ఇట్టే చెప్పేస్తుంది. అంతే కాదు దైనందిన జీవితంలో ధరించే వస్తువులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పనిచేసి రక్త పోటు, మధుమేహం వంటి ఆరోగ్య సంబంధిత గణనలు ఎంత మోతాదులో ఉన్నాయో కూడా చెప్పేస్తాయి. ఆ కోవలోనే పళ్లుతోమే హైటెక్ బ్రష్ ఒకటి వచ్చేసింది.

అమెరికాకు చెందిన ఓరల్-బీ సంస్థ ఈ అత్యాధునిక టూత్ బ్రష్​ని రూపొందించింది. సాధారణంగా మనిషికి ఆహార, శారీరక శుభ్రత ఎంత ముఖ్యమో నోటి శుభ్రత కూడా అంతే ముఖ్యం అంటోంది. ఈ బ్రష్ ని డిజైన్ చేసిన ఓరల్ బీ సంస్థ. అందుకు తగినట్లుగానే ఆధునిక సాంకేతికను జోడించి టూత్ బ్రష్ డిజైన్ చేశామంటున్నారు.

బ్రష్ పని చేసే విధానం.

ఈ టూత్ బ్రష్ ఉపయోగించే వారు దాని తాలూకు మొబైల్ యాప్​ను ఫోన్​లో డౌన్​లోడ్ చేసుకోవాలి. ఉదయం దంత దావన సమయంలో బ్రష్ ఆన్ చేసి పళ్లు తోముకావాలి. మనం ఎంత మేర బ్రష్ చేశాము. ఏ దంతాన్నైనా బ్రష్ చేయకుండా వదిలి పెట్టామా అన్న విషయం మొబైల్​లో ఉండే యాప్​ తెలుపుతుంది.

"బ్రష్​ని మొబైల్ యాప్ తో అనుసంధానించాలి. మనం బ్రష్​ చేసుకోవడాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఎంతసేపు బ్రష్​ చేశామన్నది నమోదు చేస్తుంది. ఏ ప్రాంతంలో మనం సరిగా బ్రష్ చేయలేదో తెలుపుతుంది. మన నోటిని 16 విభాగాలుగా విభజిస్తుంది. అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. ఈ బ్రష్​ ద్వారా మంచి ఫలితాలు వచ్చినట్లు వైద్య పరీక్షల్లో కూడా ఆధారాలు లభించాయి."

-ఫిలిప్ హుండెశాగన్, పీఅండ్​జీ పరిశోధనాభివృద్ధి విభాగం

ధర ఎంతంటే?

మన నోరు ఎంత శుభ్రంగా ఉంది. పళ్ల ఆరోగ్యం, చిగుళ్ల ధృడత్వం వంటి విషయాలు బ్రష్ చేసేటప్పుడే స్మార్ట్ ఫోన్ ఇట్టే చెప్పేస్తుంది. ఇంతకీ ఈ స్మార్ట్​ బ్రష్​ ధర ఎంతో తెలుసా? భారతీయ కరెన్సీలో రూ.15,000 మాత్రమే.

Last Updated : Mar 2, 2020, 6:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.