ETV Bharat / international

2021 తర్వాతే కరోనా వ్యాక్సిన్​! - Coronavirus vaccine latest information

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు ఇప్పట్లో టీకా వచ్చేలా కనిపించడం లేదు. వైరస్​ను ఎదుర్కొనేందుకు సమర్థమైన వ్యాక్సిన్​ 2021 ముందు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాకపోవచ్చని ఓ సర్వేలో తేలింది.

COVID-19 vaccine rollout unlikely before fall 2021, experts say
2021 తర్వాతే కరోనా వ్యాక్సిన్​!
author img

By

Published : Oct 2, 2020, 4:33 PM IST

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో రావడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్​ను ఎదుర్కొనేందుకు సమర్థమైన టీకా... 2021 ఏడాది తర్వాతే సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావచ్చని ఓ సర్వేలో తేలింది. ఈ మేరకు కెనడాకు చెందిన మెక్​గిల్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు.. వ్యాక్సినాలజీలో 25ఏళ్ల అనుభవం ఉన్న అమెరికా, కెనడాకు చెందిన 28 మంది శాస్త్రవేత్తలపై జూన్ నెలలో సర్వే నిర్వహించారు.

'2021 ఏడాదికి ముందే ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే ఇది​ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. వచ్చే ఏడాది చివరికి వ్యాక్సిన్​ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఉత్తమం. ఈ ప్రక్రియ 2022 వరకు కూడా జరగవచ్చు' అని పరిశోధకుల్లో ఒకరైన మెక్​గిల్​ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్​ జోనాథన్ కిమ్మెల్​మెన్ తెలిపారు. ఈ సర్వేకు సంబంధించిన విషయాలను 'జనరల్​ ఇంటర్నల్​ మెడిసిన్​' అనే జర్నల్​లో ప్రచురించారు.

సమర్థమైన వ్యాక్సిన్​ అందుబాటులోకి రావాలంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయన్నారు. 'టీకా ఆమోదం పొందిన తర్వాత, దానికి భద్రతాపరమైన హెచ్చరికలుంటే లేబుళ్లు కనిపించవచ్చు. తొలిసారిగా భారీఎత్తున చేసే క్షేత్రస్థాయి అధ్యయనం.. టీకా సమర్థతపై సానుకూలంగా నివేదించలేదు' అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: కరోనా బారిన పడిన ప్రపంచ నేతలు వీరే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.