అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు కాలిఫోర్నియాలో 20 లక్షల ఎకరాలకుపైగా అడవులు దగ్ధమైనట్లు ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ (కాల్ ఫైర్) విభాగం వెల్లడించింది.
కాలిఫోర్నియావ్యాప్తంగా కార్చిచ్చు ప్రభావం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉన్నట్లు కాల్ ఫైర్ పేర్కొంది. మంటలు అదుపు చేసేందుకు 14,100 మంది ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.
కార్చిచ్చు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసొమ్ పలు కౌంటీలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాలిఫోర్నియా వ్యాప్తంగా ఆగస్టు 18నే అత్యవసర పరిస్థితిని ప్రకటించడం గమనార్హం.
ఇదీ చూడండి:తుపాను ధాటికి జపాన్ గజగజ.. నలుగురు గల్లంతు