ETV Bharat / international

రష్యాను ఎదుర్కోవడానికి మేము సిద్ధం: బైడెన్ - అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Biden on Russia: రష్యాను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ వెల్లడించారు. పుతిన్​.. పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని ప్రారంభించారని అన్నారు. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​ ప్రజలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.

Biden on Russia
రష్యాను ఎదుర్కోవడానికి మేము సిద్ధం: బైడెన్
author img

By

Published : Mar 2, 2022, 9:16 AM IST

Updated : Mar 2, 2022, 10:12 AM IST

Biden on Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​పై తీవ్ర విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. యుద్ధ రంగంలో పుతిన్​ లాభపడొచ్చు కానీ.. దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. బలగాలతో దాడి చేయించి ఉక్రెయిన్​ను స్వాధీనం చేసుకున్నా.. అక్కడి ప్రజల మనసులను గెలుచుకోలేరని పేర్కొన్నారు.

రష్యా అక్కడితో ఆగదు..

రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్​కు పరిమితం కావని.. భవిష్యత్తులో ఇతర దేశాలపై కూడా దాడిని కొనసాగిస్తుందని బైడెన్​ పేర్కొన్నారు.

"చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకున్నాం. నియంతలను కట్టడి చేయకపోతే వారు మరింత విధ్వంసం సృష్టిస్తారు. వాళ్ల దాడులను విస్తరిస్తారు. ఈ క్రమంలో అమెరికా సహా ప్రపంచ దేశాలకు ముప్పుకు గురయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమిని ఏర్పాటు చేశాము.''

- బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

పుతిన్​.. పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని ప్రారంభించారని అన్నారు బైడెన్. 'పాశ్చాత్య దేశాలు, నాటో ఈ దాడులకు స్పందించవని పుతిన్​ భావించారు.. కానీ పుతిన్​ అంచనా తప్పు.. మేము ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము.' అని పేర్కొన్నారు.

'చైనాకు అప్పుడే హెచ్చరించాను'

అమెరికన్లతో సవాల్​ చేయడం మంచిది కాదని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు ఇదివరకే హెచ్చరించినట్లు బైడెన్​ వెల్లడించారు. అన్ని రంగాల్లోనూ చైనాను అమెరికా అధిగమించాలంటే ప్రజలు, ఆర్థికవ్యవస్థ, ప్రజాస్వామ్యాలపైనే ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలని చెప్పుకొచ్చారు.

రష్యా విమానాలపై నిషేధం

అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​ ప్రజలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం విధించడం ద్వారా రష్యన్​ విమాన సేవలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన మిత్ర దేశాల సరసన చేరనున్నట్లు పేర్కొన్నారు. వార్షిక సమావేశంలో ​ఈ మేరకు రష్యా, ఉక్రెయిన్​ అంశంపై మాట్లాడారు బైడెన్​.

ఇదీ చూడండి : అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్న రష్యా.. అక్కడే ప్రయోగం!

Last Updated : Mar 2, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.