ETV Bharat / international

'ఒమిక్రాన్.. డెల్టా కంటే డేంజర్ ఏం కాదు!' - severness of omicron

Anthony Fauci on omicron: డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్​ తక్కువ ప్రమాదకరమని ముందస్తు అధ్యయనాలు చాటుతున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. అయితే.. దీనిపై నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకునేందుకు మరింత సమాచారం కావాల్సి ఉందని తెలిపారు. మరోవైపు.. డెల్టా, బీటా వేరియంట్ల కంటే ఒమిక్రాన్​ అధికంగా వ్యాపిస్తుందని, రీఇన్​ఫెక్షన్ ముప్పు అధికంగా ఉందని సింగపూర్​ ఆరోగ్య శాఖ తెలిపింది.

omicron variant severness
ఒమిక్రాన్ వేరియంట్​
author img

By

Published : Dec 6, 2021, 9:50 AM IST

Anthony Fauci on omicron: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​పై.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ముఖ్య వైద్య సలహాదారు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్​ కంటే ఒమిక్రాన్​ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని ముందస్తు అధ్యయనాలు చాటుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్​ ప్రభావంపై ఓ నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో శాస్త్రవేత్తలకు మరింత సమాచారం కావాల్సి ఉందని చెప్పారు.

"ఇప్పటివరకైతే.. ఒమిక్రాన్ ద్వారా వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందన్న ఆధారాలు అయితే లేవు. అయితే.. డెల్టా కంటే ఈ వేరియంట్​ తక్కువగా వ్యాధి తీవ్రతను కలిగిస్తుందని, తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాదనే విషయాలపై స్థిరాభిప్రాయనాకి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది."

-ఆంటోని ఫౌచీ, అమెరికా అంటువ్యాధుల నిపుణుడు

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్రికా దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసేందుకు బైడెన్ ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోనుందని ఆంటోని ఫౌచీ తెలిపారు. "అతి త్వరలోనే ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయాలని బైడెన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా సహా ఇతర ఆఫ్రికా దేశాలు ఎదుర్కొన్న ఇబ్బందులు మనందరికీ తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు.

Omicron cases in America: ఒమిక్రాన్​ కేసులు అమెరికాలో మరింతగా విస్తరిస్తున్నాయి. శనివారం న్యూయార్క్​లో తొలికేసు నమోదు కాగా.. ఆదివారం మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్​ సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు నిపుణులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆందోళన వద్దు.. కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రి చేరికలు తక్కువే'

డెల్టా, బీటా కంటే అధికంగానే..

Singapore on omicron: ఒమిక్రాన్​ వేరియంట్​పై సింగపూర్ ఆరోగ్య శాఖ కీలక విషయాలు వెల్లడించింది. కరోనా డెల్టా, బీటా వేరియంట్ల కంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ అధికంగా వ్యాపిస్తుందని, ఈ వేరియంట్​తో రీఇన్​ఫెక్షన్ ముప్పు అధికంగా ఉందని చెప్పింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్​పై నిర్వహించిన క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయని పేర్కొంది.

"ఒమిక్రాన్ ఎదుర్కోవడంలో, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాలు పనిచేస్తున్నాయని వివిధ అధ్యయాలను చాటుతున్నాయి. వ్యాధి లక్షణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయి. అయితే.. వ్యాధి తీవ్రతపై అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడం ఇది తొందపాటు అవుతుంది. ఒమిక్రాన్ వేరియంట్​కు సంబంధించి సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి."

-సింగపూర్​ ఆరోగ్య శాఖ

మరోవైపు.. సింగపూర్​లో ఆదివారం మరో ఒమిక్రాన్ అనుమానిత కేసు వెలుగు చూసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా తేలిందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న సదరు మహిళ.. డిసెంబరు 1న దక్షిణాఫ్రికా నుంచి సింగపూర్​కు వచ్చిన మరో ఇద్దరు ఒమిక్రాన్ అనుమానిత వ్యక్తులు ప్రయాణించిన విమానంలోనే ఉన్నట్లు చెప్పింది.

సింగపూర్​లో ఆదివారం కొత్తగా 552 కరోనా కేసులు నమోదు కాగా... మరో 13 మంది కరోనా కారణంగా మరణించారు.

Tags: omicron variant, anthony faucy on omicron, america omicron cases, singapore omicron cases, omicron variant reinfection

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.