కృష్ణా జిల్లా గొల్లపూడిలో మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు నిరసనగా అదే గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇవాళ దీక్షకు దిగనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆపడానికి ఎవరు వచ్చినా తేల్చుకునేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. బూతుల మంత్రితో ముఖ్యమంత్రి జగన్ పిచ్చి మాటలు మాట్లాడించారని దుయ్యబట్టారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో జగన్ని నిలదీసే ధైర్యం మంత్రి కొడాలి నానికి ఉందా అని ప్రశ్నించారు. 2 సార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చి సాయం చేసిన చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడతారా అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి
'ఎవరు కాపాడుతారు నిన్ను?'... నెల్లూరు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే వార్నింగ్